స్టాక్ మార్కెట్లో ఆవిరైన లాభాలు.. నష్టాలతో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవరాం నష్టాలతో ముగిశాయి. ఉదయం సెషన్ లో ట్రేడింగ్ ప్రారంభం సమయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. రియాల్టీ, పీఎస్యూ సూచీలు ఒత్తిడికి గురికావడంతోనే షేర్లు పతనమయ్యాయి. మధ్యాహ్నం మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 68 పాయింట్ల మేర నష్టపోయి 66 వేల 459కు దిగజారింది. మరో సూచీ సెన్సెక్స్ 20 పాయింట్ల మేర నష్టాలతో 19 వేల 733 వద్ద సెషన్ ముగించింది. మరోవైపు నిఫ్టీ బ్యాంక్ 59 పాయింట్ల మేర నష్టాలను చవిచూసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఒక్కటే స్వల్ప లాభాల బాట పట్టింది. ఈ మేరకు 12 పాయింట్లు లాభపడింది.
జోరుగా లాభపడ్డ ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు
లాభా పడ్డ షేర్లు : ఎన్టీపీసీ (3.07%), టెక్ మహీంద్రా (2.50%), HCL టెక్నాలజీస్ (1.88%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.17%), TCS (0.87%)తో పాటు కోల్ ఇండియా, LITM, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కొ, బ్రిటానియా, సన్ ఫార్మా, UPL కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. పతమైన షేర్లు : పవర్ గ్రిడ్ (-5.11%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.45%), రిలయన్స్ (-1.38%), SBI (-1.35%) సహా హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, HDFC లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, LT, కోటక్ బ్యాంక్, ICICI బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి.