NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @22,482 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @22,482 
    లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @22,482

    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @22,482 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 13, 2025
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    దీంతో సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ (Sensex) 300 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ (Nifty) 22,500 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.

    ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ (Sensex) 105 పాయింట్లు పెరిగి 74,126 వద్ద, నిఫ్టీ (Nifty) 12 పాయింట్లు పెరిగి 22,482 వద్ద కొనసాగుతున్నాయి.

    సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 71.01 డాలర్లు 

    ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 71.01 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2,953.80 డాలర్ల వద్ద కదలాడుతోంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో 87.14 వద్ద కొనసాగుతోంది.

    అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి.ఎస్‌అండ్‌పీ సూచీ 0.49 శాతం,నాస్‌డాక్ 1.22 శాతం లాభపడగా,డోజోన్స్ 0.20 శాతం నష్టపోయింది.

    వివరాలు 

    ₹1,628 కోట్ల విలువైన షేర్ల విక్రయం 

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.14 శాతం, షాంఘై 0.09 శాతం,హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.34 శాతం నష్టాల్లో కొనసాగుతుండగా,జపాన్ నిక్కీ 0.96 శాతం లాభాల్లో ఉంది.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా ₹1,628 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా ₹1,510 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత! విజయవాడ వెస్ట్
    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్

    స్టాక్ మార్కెట్

    Stock Market : బేర్ పట్టు నుంచి కాస్త విరామం .. స్వల్ప లాభాలలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 22,959 బిజినెస్
    Stock Market: 23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 29 పాయింట్లు, నిఫ్టీ 14 పాయింట్ల నష్టం  బిజినెస్
    Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు..  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025