Page Loader
Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 77,111, నిఫ్టీ 23,309 
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 77,111, నిఫ్టీ 23,309

Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 77,111, నిఫ్టీ 23,309 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్థిరంగా (ఫ్లాట్‌గా) ట్రేడింగ్ ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా సూచీలు కొంత ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ప్రారంభంలో నిఫ్టీ (Nifty) 23,350 పాయింట్లకు పైగా ట్రేడింగ్‌ను ప్రారంభించగా, సెన్సెక్స్‌ (Sensex) స్థిరంగా మొదలైంది. అయితే, ప్రధాన షేర్లలో మదుపర్లు విక్రయాలకు దిగడంతో సూచీలు నష్టాల్లోకి మళ్లాయి.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 76.05 డాలర్లు 

ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్‌ 200 పాయింట్ల నష్టంతో 77,111 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు తగ్గి 23,309 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో,పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, టైటాన్,ఎం అండ్ ఎం,టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.87.35 వద్ద కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 76.05 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,950.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

స్వల్ప లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

అమెరికా మార్కెట్లు గత ట్రేడింగ్ సెషన్‌లో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.67 శాతం, డోజోన్స్ 0.38 శాతం, నాస్‌డాక్ 0.98 శాతం పెరిగాయి. ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.02 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 0.51 శాతం నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.4 శాతం స్థిరంగా ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) నాలుగు రోజులుగా విక్రయదారులుగా కొనసాగుతున్నారు. సోమవారం నికరంగా రూ.2,464 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మరోవైపు, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.1,516 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.