
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఐటీ రంగంలోని షేర్లలో విక్రయాలు సూచీలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫలితంగా, ప్రారంభంలో నష్టాల్లోకి వెళ్లిన సూచీలు ప్రస్తుతం లాభం-నష్టాల మధ్య ఒడిదుడుకుల మధ్య కదలాడుతున్నాయి.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 19 పాయింట్ల నష్టంతో 76,345 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ (Nifty) 1 పాయింట్ లాభంతో 23,183 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
నష్టాల్లో ట్రేడవుతున్న షేర్లు:
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జొమాటో, టైటాన్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
లాభాల్లో ఉన్న షేర్లు:
బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 72.29 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 3,039 డాలర్ల మార్క్‌ను దాటింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో 86.20 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
స్వల్ప నష్టాల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు
అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
ఎస్‌అండ్‌పీ సూచీ 0.22 శాతం, నాస్‌డాక్ 0.33 శాతం నష్టపోయాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
జపాన్ నిక్కీ స్వల్ప లాభంలో ఉంటే, హాంకాంగ్ హాంగ్‌సెంగ్, షాంఘై సూచీలు బలహీనంగా కదలాడుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తిరిగి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. గురువారం నికరంగా రూ.3,239 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
అదే సమయంలో, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,136 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.