Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 454, నిఫ్టీ 141 పాయింట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, అలాగే బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బెంచ్‌మార్క్ సూచీలు ప్రదర్శన ఇచ్చాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల వరకు లాభపడగా, నిఫ్టీ 23,300 పైగా స్థిరపడింది.
సెన్సెక్స్ ఉదయం 76,978.53 పాయింట్ల వద్ద లాభంతో ప్రారంభమైంది (క్రితం ముగింపు 76,619.33). ఇంట్రాడేలో ఇది 76,584.84 నుంచి 77,318.94 పాయింట్ల మధ్య కదలాడింది.
చివరికి 454.11 పాయింట్ల లాభంతో 77,073.44 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ కూడా 141.55 పాయింట్ల లాభంతో 23,344.75 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి 86.55 వద్ద స్థిరపడింది.
వివరాలు
లాభపడిన బ్యాంకింగ్ షేర్లు
సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభపడ్డాయి.
జొమాటో, అదానీ పోర్ట్స్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలు చవిచూశాయి.
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 80 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2760 డాలర్ల వద్ద కొనసాగుతోంది.