LOADING...
Stock Market: అమెరికా డీల్, జపాన్ ఎన్నికల ప్రభావం.. భారీ లాభాల్లో సూచీలు
అమెరికా డీల్, జపాన్ ఎన్నికల ప్రభావం.. భారీ లాభాల్లో సూచీలు

Stock Market: అమెరికా డీల్, జపాన్ ఎన్నికల ప్రభావం.. భారీ లాభాల్లో సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో భారత్ మధ్య జరిగిన కీలక ఒప్పందం ఒకవైపు, జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సనాయే తకైచి విజయం మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్‌కు బలంగా తోడైంది. ఈ సానుకూల పరిణామాల ప్రభావంతో సోమవారం మార్కెట్ జోరుగా ప్రారంభమై లాభాల బాటలో కొనసాగుతోంది. సనాయే తకైచి గెలుపుతో ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాలతో ముందుకెళ్తుండగా, గత వారం భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం దేశీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని మరింత పెంచింది. దీంతో మార్కెట్ ప్రారంభం నుంచే ప్రధాన సూచీలు బలమైన లాభాల్లో దూసుకెళ్లాయి.

వివరాలు 

FMCG రంగం మినహా మిగతా అన్ని రంగాలలో లాభాల్లో సూచీలు

ప్రస్తుతం సెన్సెక్స్ 361 పాయింట్లు పెరిగి 83,941 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 25,804 స్థాయిలో కొనసాగుతోంది. నిఫ్టీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్నాలజీస్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభాలు ఆర్జించాయి. మరోవైపు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మాక్స్ హెల్త్‌కేర్, హిందుస్తాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కదలాడాయి. రంగాల వారీగా చూస్తే, FMCG రంగం మినహా మిగతా అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Advertisement