
Stock market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,581
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గత రోజు సోమవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఈ రోజు మాత్రం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినా కూడా భారతీయ మార్కెట్లు లాభ దిశగా కదులుతున్నాయి. ఉదయం 9.34 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 83,827 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 64 పాయింట్లు ఎగసి 25,581 వద్ద కొనసాగుతోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ 85.34గా ఉంది.
వివరాలు
నష్టాల్లో..
ఇతర వివరాల్లోకి వెళితే, అపోలో హాస్పిటల్స్, ఆసియన్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, జియో ఫైనాన్షియల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ స్టాక్స్ మాత్రం నష్టాల్లో కదులుతున్నాయి.