Page Loader
Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం వంటి ప్రధాన కంపెనీల షేర్ల విక్రయాలు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫలితంగా, మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 22,900 కంటే తక్కువ వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:30 గంటల సమయానికి, సెన్సెక్స్ 309 పాయింట్లు కోల్పోయి 75,692 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు పడిపోయి 22,858 వద్ద ట్రేడవుతున్నాయి.

వివరాలు 

బంగారం ఔన్సు 2,946.10 డాలర్లు 

సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్‌టెల్,హెచ్‌యూఎల్,ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, ఎన్టీపీసీ,టాటా స్టీల్, టాటా మోటార్స్,కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 75.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,946.10 డాలర్ల వద్ద కదలాడుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి,అందులో ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.70% నష్టపోగా, జపాన్ నిక్కీ 0.41% తగ్గింది. హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.61% నష్టంతో కొనసాగుతుండగా,షాంఘై మార్కెట్ మాత్రం 0.48% లాభాల్లో ట్రేడవుతోంది.

వివరాలు 

₹3,072 కోట్ల షేర్లను కొనుగోలుచేసిన దేశీయ సంస్థాగత మదుపర్లు 

విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా ₹4,787 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) ₹3,072 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. మార్కెట్ ప్రారంభంలోనే నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభమైనప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు, సంస్థాగత పెట్టుబడిదారుల వ్యూహాలు మార్కెట్ కదలికలను ప్రభావితం చేసే అవకాశముంది.