Swiggy food delivery: 100 రైల్వే స్టేషన్లలో డెలివరీ సేవలు ప్రారంభించిన ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ రైళ్లలో భోజనాన్ని అందించే సేవలను మరింత విస్తరించింది.
ఇప్పటికే ఐఆర్‌సీటీసీతో కలిసి కొన్ని స్టేషన్లలో ఈ సేవలను అందిస్తున్న స్విగ్గీ, తాజాగా ఆ సంఖ్యను 20 రాష్ట్రాల్లోని 100 రైల్వే స్టేషన్లకు పెంచింది.
రాబోయే రోజుల్లో మరిన్ని స్టేషన్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్రకటించింది.
''భారతీయ సంస్కృతిలో రైల్వే ప్రయాణం కీలక భాగం.ఈ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడంలో రుచికరమైన ఆహారం కీలకం. అందుకే 100 రైల్వే స్టేషన్లలో మా సేవలను విస్తరించాం'' అని స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ తెలిపారు.
రైల్వే ప్రయాణికులకు ఉత్తమమైన భోజనాన్ని అందించేందుకు స్విగ్గీ 2024 మార్చిలో ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
వివరాలు
రోజుకు లక్షకు పైగా ఆహార ఆర్డర్లు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా ఈ ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
మరో ప్రముఖ ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కూడా రైల్వే స్టేషన్లలో ఇదే విధమైన సేవలను అందిస్తోంది.
ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు కలిసి రోజుకు లక్షకు పైగా ఆహార ఆర్డర్లను డెలివరీ చేస్తున్నట్లు అంచనా.