
Swiggy Pyng app: పింగ్ పేరిట కొత్త యాప్ ప్రారంభించించిన స్విగ్గీ..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ (Swiggy) ఇప్పుడు మరో కొత్త రంగంలో అడుగుపెట్టింది.
ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సేవలందించిన ఈ సంస్థ, తాజాగా హెల్త్, వెల్‌నెస్, ఆస్ట్రాలజీ, ఈవెంట్ ప్లానింగ్ వంటి రంగాల్లో పనిచేసే నిపుణులతో ప్రజలను కలిపే లక్ష్యంతో 'పింగ్' (Pyng) పేరుతో ఒక ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.
ప్రొఫెషనల్ సర్వీసుల మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చింది.
ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది.
వివరాలు
ప్రొఫెషనల్స్‌తో సులభంగా కనెక్ట్
ఈ కాలంలో జీవనశైలి వేగంగా మారిపోతుండటంతో, ట్యాక్స్ కన్సల్టెంట్‌లు, యోగా గురువులు వంటి నిపుణుల అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్విగ్గీ ఇన్నోవేషన్ విభాగం ఇన్‌చార్జ్, సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి తెలిపారు.
ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలు తమకు అవసరమైన ప్రొఫెషనల్స్‌తో సులభంగా కనెక్ట్ అవ్వవచ్చని చెప్పారు.
ప్రస్తుతం ఈ సర్వీస్ బెంగళూరు వాసులకు అందుబాటులో ఉండగా, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నట్లు స్విగ్గీ ప్రకటించింది.
ఈ ప్లాట్‌ఫామ్‌లో దేశం నలుమూలల నుండి కనీసం 10 వేల మంది నిపుణులను చేర్చుకునే దిశగా సంస్థ ముందుకు సాగుతోంది.
వివరాలు
ప్లాట్‌ఫామ్‌లో అనేక రంగాల్లో పనిచేసే నిపుణులు
ఈ సేవలలో భాగంగా ఫైనాన్షియల్ ట్రైనర్లు, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, పోషకాహార నిపుణులు, థెరపిస్టులు, ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్లు, జ్యోతిష్కులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, ట్రిప్ ప్లానర్లు, ట్రావెల్ అడ్వైజర్లు, మ్యూజిక్, డ్యాన్స్ గురువులు, కెరీర్ కౌన్సిలర్లు లాంటి అనేక రంగాల్లో పనిచేసే నిపుణులు ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటారు.