Swiggy: స్టాక్ మార్కెట్ లోకి మరో బిగ్గెస్ట్ IPO.. స్విగ్గీ ఐపీవోకి సంబంధించిన కీలక సమాచారం
స్టాక్ మార్కెట్‌లో ఐపీవోల హడావుడి కొనసాగుతూనే ఉంది.ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టే ఐపిఓలు వరుసగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ ఏడాది ప్రముఖ కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూలు మార్కెట్‌లో అడుగుపెట్టాయి. ఇదే దారిలో ఇప్పుడు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy)కూడా IPOకి సిద్ధమైంది. రూ.11,300 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఈ IPO రాబోతోంది. స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 6 నుంచి నవంబర్ 8 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. నవంబర్ 11న షేర్ల అలాట్మెంట్ జరుగుతుంది,నవంబర్ 13న BSE,NSEలో లిస్టింగ్‌కు వస్తాయి. ఈ IPO ధర శ్రేణిని రూ.371-390గా నిర్ణయించారు.లాట్ సైజ్ 38షేర్లు ఉండేలా ఉంది, అంటే రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 38షేర్ల లాట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఐపీఓ ద్వారా మొత్తం రూ.6,800 కోట్లు
కనీస పెట్టుబడి రూ.14,820 ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా స్విగ్గీ మొత్తం రూ.6,800 కోట్లు సమీకరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతానికి Swiggy Ltd అన్‌లిస్టెడ్ షేర్లు గ్రే మార్కెట్‌లో దాని ఇష్యూ ధర కంటే రూ.19 ఎక్కువ ధరకు ట్రేడవుతున్నాయి. ఈ రూ.19 గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) పబ్లిక్ ఇష్యు లిస్టింగ్ సమయంలో 4.87 శాతం లాభం వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది. అయితే GMP మార్కెట్ సెంటిమెంట్‌లపై ఆధారపడి మారుతుంది. 'గ్రే మార్కెట్ ప్రీమియం' అంటే ఇష్యూ ధర కంటే ఎక్కువ ఉండటం పెట్టుబడిదారుల ఆసక్తిని సూచిస్తుంది.
2014లో స్విగ్గీ బెంగళూరులో స్థాపించారు
స్విగ్గీ బెంగళూరులో 2014లో స్థాపించబడింది. ఫుడ్ డెలివరీలో పాపులర్ అయిన ఈ సంస్థ ఇప్పుడు నిధుల సమీకరణలో భాగంగా IPOని ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది అతి పెద్ద IPOలలో ఒకటిగా నిలుస్తున్న ఈ IPOకు ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.