LOADING...
Food delivery charge: యూజర్లకు షాక్‌.. మరింత భారం కానున్న స్విగ్గీ, జొమాటో ఫుడ్‌ డెలివరీ 
యూజర్లకు షాక్‌.. మరింత భారం కానున్న స్విగ్గీ, జొమాటో ఫుడ్‌ డెలివరీ

Food delivery charge: యూజర్లకు షాక్‌.. మరింత భారం కానున్న స్విగ్గీ, జొమాటో ఫుడ్‌ డెలివరీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు మరింత ప్రియం కానునున్నాయి. స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్‌పిన్ వంటి ప్రముఖ సంస్థలు తమ డెలివరీ సేవల చార్జీలను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పండగల సమయం దగ్గరపడటంతో ఇప్పటికే ఈ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌ ఫీజులను పెంచేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా, ఈ నెల 22నుంచి డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ వర్తించనుండడంతో .. దీంతో వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ఆన్‌లైన్‌ ఆహార ఆర్డర్‌ చేయడంపై ప్రస్తుతం రెండు రకాల జీఎస్టీ ఛార్జీలు వర్తిస్తాయి. మొదటిది, ఆర్డర్‌ చేసే ఆహారంపై వర్తించే జీఎస్టీ. రెండవది డెలివరీ సదుపాయానికి సంబంధించిన జీఎస్టీ.

వివరాలు 

సెప్టెంబర్‌ 22నుంచి డెలివరీ ఛార్జీలపై కూడా 18% జీఎస్టీ వసూలు

ప్రస్తుతం ఆహారంపై 5% జీఎస్టీ వర్తిస్తోంది. ఇది 2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు, సెప్టెంబర్‌ 22నుంచి డెలివరీ ఛార్జీలపై కూడా 18% జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఈ మొత్తం డబ్బు సర్వీస్ అందించే ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారుల నుంచి స్వీకరించనున్నారు. ఈ కొత్త విధానం వల్ల వినియోగదారులు ఎంత మొత్తాన్ని అదనంగా చెల్లించాల్సి వస్తుందో చూడాలి. ఫుడ్‌ డెలివరీ సంస్థలు ముందుగా కేవలం డెలివరీ ఛార్జీని మాత్రమే వసూలు చేసేవి. కానీ ఆన్‌లైన్‌ ఆర్డర్ల పెరుగుదలతో పాటు లాభాలను మెరుగుపరచేందుకు ప్లాట్‌ఫామ్‌ ఫీజు విధించటం ప్రారంభించాయి. ప్రారంభంలో రూ.2 నుంచి మొదలైన ప్లాట్‌ఫామ్‌ ఫీజు తర్వాత రూ.5, రూ.10కి పెరిగింది. తాజాగా ఈ సంస్థలు తమ ఫీజులను మళ్ళీ సవరించాయి.

వివరాలు 

మ్యాజిక్‌పిన్‌ ప్రతి ఆర్డర్‌కి రూ.10 ప్లాట్‌ఫామ్‌ ఫీజు

ఎంపిక చేసిన మార్కెట్లలో స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజుగా జీఎస్టీ సహా రూ.15 వసూలు చేయనుంది. జొమాటో మాత్రం జీఎస్టీ మినహాయించి రూ.12.50 ఫీజు విధించింది. మ్యాజిక్‌పిన్‌ కూడా ప్రతి ఆర్డర్‌కి రూ.10 ప్లాట్‌ఫామ్‌ ఫీజు నిర్ణయించింది. దీంతో, గతంలో కంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆహారం కొనుగోలు చేయడం ఖరీదైన ప్రక్రియగా మారింది. డెలివరీ ఛార్జీలపై ఇకపై కొత్తగా విధించనున్న 18% జీఎస్టీ కారణంగా జొమాటో వినియోగదారులు ఒక్కో ఆర్డర్‌కి సుమారు రూ.2, స్విగ్గీ వినియోగదారులు రూ.2.6 చొప్పున అదనపు చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి, ఒకప్పుడు ప్లాట్‌ఫామ్‌ ఫీజుగా రూ.10 మాత్రమే చెల్లించేవారు, ఇప్పుడు జీఎస్టీ, ఫీజు పెరుగుదల వల్ల మరో 5 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.