Page Loader
Auto shares fall: కొత్త ఈవీ పాలసీ రాబోతోందన్న వార్తల నేపథ్యంలో.. మహీంద్రా,టాటా మోటార్స్‌ షేర్లు డౌన్‌
కొత్త ఈవీ పాలసీ రాబోతోందన్న వార్తల నేపథ్యంలో.. మహీంద్రా,టాటా మోటార్స్‌ షేర్లు డౌన్‌

Auto shares fall: కొత్త ఈవీ పాలసీ రాబోతోందన్న వార్తల నేపథ్యంలో.. మహీంద్రా,టాటా మోటార్స్‌ షేర్లు డౌన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 21, 2025
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్,మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త విద్యుత్ వాహన (EV) పాలసీని ప్రకటించనుందనే వార్తల నేపథ్యంలో ఈ రెండు కంపెనీల స్టాక్స్‌ ఈ ఉదయం ఆరు శాతం వరకు క్షీణించాయి. అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీదారు టెస్లా భారత్‌లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. అయితే, దిగుమతి సుంకాలను మరింత తగ్గించాలని టెస్లా కోరుతోంది. ఈ నేపథ్యంలో, టెస్లా ప్రవేశాన్ని సులభతరం చేసేలా ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని రూపొందిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దిగుమతి సుంకాల కోత వల్ల అంతర్జాతీయ కార్ల కంపెనీలు భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు అవకాశం లభించనుంది, దీనివల్ల దేశీయ ఆటోమొబైల్ సంస్థలకు తీవ్రమైన పోటీ ఏర్పడే అవకాశముంది.

వివరాలు 

నిఫ్టీ ఆటో సూచీ 2% మేర నష్టపోయింది

ఈ పరిణామాల ప్రభావంతో, నిఫ్టీ ఆటో సూచీ 2% మేర నష్టపోయింది. మహీంద్రా అండ్ మహీంద్రా 6%, టాటా మోటార్స్ 2% కి పైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం భారత EV మార్కెట్‌లో ప్రధాన వాటా కలిగిన సంస్థలు ఇవే కావడంతో, కొత్త విధానాలు వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ మొత్తంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి సెన్సెక్స్ 445 పాయింట్లు తగ్గి 75,290.42 వద్ద ఉంది నిఫ్టీ 133 పాయింట్లు పడిపోయి 22,779 వద్ద ట్రేడవుతోంది