Tesla Sales : యూరప్‌లో టెస్లా అమ్మకాలు 45శాతం తగ్గుదల.. మస్క్ వివాదాలు కారణమా?
ఈ వార్తాకథనం ఏంటి
లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే ప్రస్తుతం యూరప్‌లో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
2025 జనవరిలో టెస్లా అమ్మకాలు భారీగా పడిపోయాయి. అది కూడా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 37శాతం పెరిగినా టెస్లా అమ్మకాలు మాత్రం 45శాతం తగ్గాయి.
చైనా ముఖ్యంగా SAIC మోటార్స్ (MG మాతృ సంస్థ) వంటి బ్రాండ్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది.
యూరప్‌లో టెస్లా అమ్మకాల క్షీణత
2025 జనవరిలో టెస్లా అమ్మకాలు 45% తగ్గాయి. 2024 జనవరిలో 18,161 యూనిట్లు విక్రయించగా, 2025లో ఆ సంఖ్య 9,945 యూనిట్లకు పడిపోయింది. ఫ్రాన్స్‌లో 63శాతం, జర్మనీలో 59.5శాతం క్షీణించాయి.
Details
తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఎలాన్ మస్క్
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
జర్మన్ రాజకీయ పార్టీ AFDకి మద్దతు, వివాదాస్పద ట్వీట్లు, పబ్లిక్ స్టేట్మెంట్స్ వంటి కారణాల వల్ల యూరప్‌లో నెగటివ్ ఇమేజ్ ఏర్పడింది. ఇది టెస్లా బ్రాండ్‌పై ప్రభావం చూపిస్తోంది.
ముఖ్యంగా టెస్లా నూతన 'Model Y' కోసం వినియోగదారులు వేచిచూస్తున్నారు. చైనాలో ముఖ్యంగా SAIC మోటార్స్, భారీగా అమ్మకాలు పెంచుకున్నాయి. SAIC మోటార్స్ జనవరి 2025లో 22,994 యూనిట్లు విక్రయించింది.
ఇది టెస్లా కంటే చాలా ఎక్కువ. యూరప్ BEV మార్కెట్ 37శాతం వృద్ధి చెంది 1,24,341 యూనిట్లు అమ్మకాలు నమోదయ్యాయి.