Elon Musk-Tesla: 10శాతం పైగా కోతలుంటాయి: టెస్లా సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ సంచలన ప్రకటన
ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) సంచలన ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థలో 10% పైగా ఉద్యోగాల కోత విధించాలనుకుంటున్నట్లు మస్క్ వెల్లడించారు. ఒకే పనిని చేసేందుకు అధిక సిబ్బంది(డుప్లికేషన్ ఆ ఫ్ రోల్స్) ఉండటమే ఉద్యోగాల కోతకు కారణమని వివరించారు. ఎలాన్ మస్క్ తాజా ప్రకటన అమలులోకి వస్తే సంస్థకు చెందిన 14వేలకు పైగా మంది తమ ఉద్యోగాలను కొల్పోనున్నారు. సంస్థ బాగా వృద్ధి చెందాలంటే అనవసర వ్యయాలను తగ్గించుకోవాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మస్క్ వివరించారు. విద్యుత్ వాహనాల డిమాండ్ ను పెంచేందుకు టెస్లా సంస్థ వరుసగా ధరలు తగ్గించినప్పటికీ వాహనాల డెలివరీల్లో తగ్గుదల కనిపించినట్లు అంతర్గత నివేదికలో టెస్లా పేర్కొంది.
ప్రధానితో భేటీపై స్పష్టత లేదు
దీంతో 10 శాతానికి పైగా ఉద్యోగాల్లో కోత విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీని ఈ నెల లో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ భేటీ కానున్న నేపథ్యంలో...భారత్ లో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఎలన్ మస్క్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ నెలలోనే తాను ఇండియా పర్యటిస్తానని తన ఎక్స్ ఖాతాలో ఎలన్ మస్క్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పోస్ట్ కు ప్రతిస్పందనగా ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ భారత్ లో టెస్లా సంస్థ పెట్టుబడులు పెట్టాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని అందుకోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ప్రధాని మోదీ, ఎలన్ మస్క్ ల ఎప్పుడు భేటీ అవుతారన్నదీ ఇంకా స్పష్టత లేదు.