LOADING...
Trump Tariff Bomb:భారత్‌ ఎగుమతులపై 25% సుంకం.. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ లాంటి కీలక రంగాలకు భారీ దెబ్బ!
ఎలక్ట్రానిక్స్, ఫార్మా,టెక్స్టైల్ లాంటి కీలక రంగాలకు భారీ దెబ్బ!

Trump Tariff Bomb:భారత్‌ ఎగుమతులపై 25% సుంకం.. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ లాంటి కీలక రంగాలకు భారీ దెబ్బ!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 31న తీసుకున్న కీలక నిర్ణయంతో భారత్‌ ఎగుమతులపై 25 శాతం దిగుమతి సుంకం (టారిఫ్) అమలు చేయనున్నారు. ఈ విధానం 2025,ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుండగా,ఇది భారత్‌ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్,ఫార్మా,వస్త్ర పరిశ్రమలు ఈ నిర్ణయానికి బలయ్యే అవకాశముంది. ఈ చర్యల వెనుక భారత్‌తో ఉన్న అమెరికా ట్రేడ్ సర్ప్లస్‌ (వాణిజ్య మిగులు)ప్రధాన కారణమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ''భారత్ మా మిత్రదేశమే అయినా,అక్కడ టారిఫ్‌లు అత్యధికంగా ఉన్నాయి.అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక నాన్-టారిఫ్ బారియర్ల (వ్యాపారానికి ఆటంకాలు) దేశాల్లో భారత్‌ ఒకటి'' అని విమర్శించారు.

వివరాలు 

2025లో ట్రేడ్ గణాంకాలు 

భారత్‌-రష్యా మధ్య ఉన్న సంబంధాలు కూడా ఈ చర్యలకు ప్రేరకంగా నిలిచినట్టు ఆయన హింట్ ఇచ్చారు. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ అమెరికాతో 41.18 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు నమోదు చేసింది. ఇందులో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులు 11.6శాతం పెరిగి 86.5బిలియన్ డాలర్లకు చేరగా, భారత్‌ దిగుమతులు 7.4 శాతం పెరిగి 45.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ వాణిజ్య అసమతుల్యతను తగ్గించేందుకు ట్రంప్ ఈ కొత్త టారిఫ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారన్నది స్పష్టం. ఎలారా క్యాపిటల్‌కు చెందిన ఆర్థిక నిపుణురాలు గరిమా కపూర్ ప్రకారం,వియత్నాం,ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ వంటి పోటీ దేశాలపై తక్కువ టారిఫ్‌లు ఉండగా,భారత్‌పై 25శాతం టారిఫ్ విధించడం ఆర్థికంగా భారత్‌కు పెనుముప్పు కలిగించనున్నదని హెచ్చరించారు.

వివరాలు 

అమెరికాకు భారత్‌ ఎగుమతిచేసే టాప్-5 ఉత్పత్తులు ఇలా ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్లు: 2025 రెండో త్రైమాసికంలో భారత్, చైనాను అధిగమించి అమెరికాకు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ సరఫరాదారుగా ఎదిగింది. తక్కువ ధర, అధిక ఫీచర్లతో భారత ఫోన్లకు అమెరికాలో డిమాండ్ పెరిగింది. జనవరి 2025 నాటికి ఈ రంగం 3 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు సాధించింది. ఇంధన ఉత్పత్తులు: భారత్ ఆసియాలో రెండో అతిపెద్ద రిఫైనింగ్ హబ్‌గా పనిచేస్తోంది. పెట్రోల్, డీజిల్, జెట్‌ఫ్యూయల్, గ్యాసొలిన్, ఎల్‌పీజీ వంటి ఉత్పత్తులను అమెరికాకు భారీగా ఎగుమతిస్తోంది. 2024 నాటికి ఈ రంగం 20 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది.

వివరాలు 

అమెరికాకు భారత్‌ ఎగుమతిచేసే టాప్-5 ఉత్పత్తులు ఇలా ఉన్నాయి.

ఆభరణాలు: డైమండ్లు, బంగారు నగలు, రఫ్ రత్నాలు, హస్త కళా ఆభరణాలు పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతవుతున్నాయి. గత సంవత్సరం ఈ రంగం 8.5 బిలియన్ డాలర్లను దాటి ఎగుమతుల్ని నమోదు చేసింది. ఫార్మా ఉత్పత్తులు: భారతదేశం ఎఫ్‌డీఏ ప్రమాణాలకు అనుగుణంగా జెనరిక్ మందులు, వ్యాక్సిన్లు, APIలను తయారుచేసి అమెరికాకు సరఫరా చేస్తోంది. 2025 నాటికి ఫార్మా రంగం 7.5 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు చేశాయి. వస్త్ర పరిశ్రమ: సిల్క్ హ్యాండ్లూమ్స్, కాటన్ గార్మెంట్లు వంటి వస్త్ర ఉత్పత్తులు అమెరికాలో మంచి గిరాకీ పొందుతున్నాయి. 2025లో ఈ రంగం 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించింది.

వివరాలు 

భవిష్యత్తుపై ప్రభావం 

ఈ తాజా టారిఫ్ విధానం వల్ల భారత ఎగుమతులపై ఆధారపడిన ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆభరణాలు, వస్త్ర రంగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. వ్యాపార వర్గాలు ఇప్పటికే ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక భారత ప్రభుత్వం, వ్యాపార సంఘాలు ఈ చర్యలకు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాలతో చర్చలు, వ్యూహాత్మక నిర్ణయాలు భారత్‌కు ఈ కష్ట కాలంలో ఊతంగా నిలవాలని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.