Page Loader
Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు
అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు

Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2024
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యే సమయంలో మార్కెట్లు లాభాలు సాధించడం విశేషం. సెన్సెక్స్‌ 220 పాయింట్లకు పైగా పెరిగి ప్రారంభమవ్వగా, నిఫ్టీ 24,300 పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 399 పాయింట్లు పెరిగి 78,875 వద్ద, నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 24,347 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.23 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ఫిన్‌ సర్వ్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాలతో నడస్తున్నాయి.

Details

నష్టాలను చవిచూసిన టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్

టైటన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌, టాటా మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలను చవి చూడడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75.81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, బంగారం ఔన్సు 2,744.80 డాలర్ల వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. అయితే ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 2.25%, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.93%, షాంగై 2.12% లాభాలను నమోదు చేశాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 2.57% నష్టంతో కొనసాగుతుంది. మంగళవారం వీరు నికరంగా రూ.2,569 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు, అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,031 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.