Page Loader
Hindenburg: ఆ ఫండ్స్ మా దేశానికి కావు.. హిండెన్ బర్గ్ రిపోర్టుపై మండిపడ్డ మారిషన్
ఆ ఫండ్స్ మా దేశానికి కావు.. హిండెన్ బర్గ్ రిపోర్టుపై మండిపడ్డ మారిషన్

Hindenburg: ఆ ఫండ్స్ మా దేశానికి కావు.. హిండెన్ బర్గ్ రిపోర్టుపై మండిపడ్డ మారిషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2024
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

హిండెన్‌బర్గ్ రిపోర్టుపై మారిషన్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ అగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ పేర్కొన్న ఐపీఈ ప్లస్ ఫండ్, ఐపీఈ ఫండ్-1 తమ దేశానిని కావని మారిషన్ స్పష్టం చేసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ ఆఫ్ మారిషన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. షెల్ కంపెనీల ఏర్పాటుకు తమ రూల్స్ అంగీకరించవని, తమను ట్యాక్స్ హెవెన్‌గా వర్ణించేందుకు వీల్లేదని పేర్కొంది. గ్లోబెల్ బిజినెస్ కంపెనీల కోసం తమ వద్ద పటిష్ట వ్యవస్థలు ఉన్నట్లు తెలిపింది.

Details

ఫండ్స్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వలేదు

సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ సెబీలో చేరిక ముందు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీతో కలిసి మారిషన్‌లో నమోదైన ఈ రెండు ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎఫ్ఎస్‌సీఎం ఈ ప్రకటన రిలీజ్ చేసింది. ఇతర దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు తమ దేశంలో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయడానికి తమ చట్టాలు ఒప్పుకోవని వెల్లడించింది. ముఖ్యంగా ఈ ఫండ్స్ ఏర్పాటుకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ప్రకటించింది.