Income Tax: ఇంటిని కొనుగోలు చేయడం మంచిదా..లేదా కిరాయి ఇంట్లో ఉండటం మంచిదా.. ఇంతకీ ఏం చేయాలి?
ఈ వార్తాకథనం ఏంటి
ఇల్లు కొనడం లేదా నిర్మించడం చిన్న విషయమేమీ కాదు. దీనికి చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం.
ప్రస్తుతానికి ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో, కొంతమంది అద్దెకు ఉండడమే మంచిదని భావించవచ్చు.
అయితే, ఇల్లు కొనుగోలు చేయడం మంచిదా? లేక కిరాయికే పరిమితమవ్వడం బెటరా? లాభనష్టాలు ఏవీ? ఇప్పుడు అవి వివరంగా తెలుసుకుందాం.
వివరాలు
మధ్యతరగతి ప్రజలకు ప్రభావం
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు కొంత మేరకు పన్ను భారం తగ్గించబడింది.
దీని వల్ల చాలా మంది తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
అయితే, ఇల్లు కొనుగోలు చేయాలా లేక అద్దె ఇంట్లోనే కొనసాగాలా? ఇది వ్యక్తిగత ఆర్థిక భద్రతను ప్రభావితం చేసే ముఖ్యమైన నిర్ణయం.
ఇల్లు కొనుగోలు చేస్తే పాత పన్ను విధానంలో కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
హోం లోన్ తీసుకుంటే, EMIలోని ప్రిన్సిపల్ అమౌంట్ మరియు వడ్డీపై పన్ను మినహాయింపులు పొందవచ్చు.
వివరాలు
మినహాయింపులు
సెక్షన్ 80C కింద-ప్రిన్సిపల్ రీపేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు సహా రూ. 1.5 లక్షల వరకు డిడక్షన్ పొందవచ్చు.
హోం లోన్ వడ్డీపై - మీరు స్వయంగా నివసిస్తున్న ఇంటికైనా, అద్దెకు ఇచ్చిన ఇంటికైనా ఏడాదికి రూ. 2 లక్షల వరకు డిడక్షన్ పొందే అవకాశం ఉంది.
మీరు స్వయంగా నివసించే ఇంటికి అద్దె ఆదాయం లేకపోతే,హోం లోన్ వడ్డీని నష్టంగా పరిగణించి, ఇతర ఆదాయంతో సర్దుబాటు చేసుకోవచ్చు.
ఆ నష్టం పరిమితిని మించి ఉంటే,దానిని 8 సంవత్సరాల పాటు క్యారీ ఫార్వర్డ్ చేసే వెసులుబాటు ఉంటుంది.
వివరాలు
అద్దె ఇంట్లో ఉండడం - ప్రయోజనాలు
ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ ప్రాపర్టీలు కలిగి ఉంటే, పన్ను చట్టాల ప్రకారం కేవలం రెండు ఆస్తులను మాత్రమే స్వంత వినియోగానికి అన్వయిస్తారు.
మిగిలిన ప్రాపర్టీలకు అంచనా మార్కెట్ అద్దె ఆధారంగా పన్ను విధించబడుతుంది.
ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) పై పన్ను మినహాయింపు లభిస్తుంది.
స్వయం ఉపాధి పొందిన వ్యక్తులకు పాత పన్ను విధానంలో నెలకు రూ. 5000 వరకు డిడక్షన్ అవకాశం ఉంటుంది.
సాధారణంగా, ఇంటి EMI కంటే అద్దె తక్కువగా ఉండటంతో ఆర్థిక భారం తగ్గుతుంది.
జీవన పరిస్థితులకు అనుగుణంగా, ఉద్యోగ అవసరాలకు అనుసరించి, ఎప్పుడైనా ఇల్లు మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది.
ఇంటి మెయింటెనెన్స్ ఖర్చులు యజమానికే సంబంధించినవని, అద్దెదారులపై భారం ఉండదు.
వివరాలు
ఏది మంచి ఎంపిక?
ఇల్లు కొనడం లేదా అద్దెకు ఉండటం వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
దీని కోసం, మీరు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక, పన్ను ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితులు, సొంత ఇంటి భద్రత, అద్దె జీవితంలోని ఫ్లెక్సిబిలిటీ వంటి అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి.
మీ అవసరాలకు తగ్గట్లు సరిగ్గా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం!