ప్రపంచంలోనే ది బెస్ట్ వియానయాన సంస్థ ఇదే!
2023లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్ లైన్స్ చరిత్ర సృష్టించింది. గతేడాది టాప్ ఎయిర్ లైన్స్ గా నిలిచిన ఖతార్ ఎయిర్ వేస్ ఈ ఏడాది రెండోస్థానానికి దిగజారింది. ప్రయాణికులకు అందించే సేవల ఆధారంగా ప్రతేడాది అత్యుత్తమ విమాయాన సంస్థను ప్రకటిస్తారు. మూడోస్థానంలో జపాన్ కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్, నాలుగో స్థానంలో ఎమిరేట్స్, ఐదో ర్యాకుంలో జపాన్ ఎయిర్ లైన్స్ నిలిచాయి. అయితే స్త్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డు 2023లో ఈ ఎయిర్ లైన్స్ కు ఈ ర్యాంకింగ్స్ లభించడం విశేషం. అదే విధంగా బెస్ట్ బిజినెస్ క్లాస్ ఎయిర్ లైన్, సీట్ అండ్ లాంజ్ కేటగిరీల్లో ఖతార్ ఎయిర్ వేస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
టాప్ 20లో ఉన్న ఎయిర్ లైన్స్ ఇవే!
బడ్జెట్ ఎయిర్ లైన్స్ కేటగిరీలో చవకైన ఎయిర్ లైన్స్ గా ఎయిర్ఆసియా తొలి స్థానంలో ఉంది. అత్యంత పరిశుభ్రమైన ఎయిరల్ లైన్స్ కేటగిరీలో తొలి ర్యాంకును ఏఎన్ఏ సాధించింది. టాప్‌లో ఉన్న ఎయిర్ లైన్స్ సింగపూర్ ఎయిర్ లైన్స్, ఖతార్ ఎయిర్ వేస్, ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ), ఎమిరేట్స్, జపాన్ ఎయిర్ లైన్స్ , టర్కిష్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్, కాథే ఫసిఫిక్ ఎయిర్ లైన్స్, ఇవా ఎయిర్, కొరియన్ ఎయిర్, హైనన్ ఎయిర్ లైన్స్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్, ఎతిహాద్ ఎయిర్ వేస్, ఐబీరియా, ఫిజి ఎయిర్ వేస్, విస్తారా, క్వాంటాస్ ఎయిర్ వేస్, బ్రిటిష్ ఎయిర్ వేస్, ఎయిర్ న్యూజీలాండ్, డెల్టా ఎయిర్ లైన్స్.