Upcoming IPOs: ఈ వారం ఐపీఓ క్యాలెండర్.. మార్కెట్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చే కంపెనీలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు తగ్గుతోంది. ఒకప్పుడు వారానికి సగటున ఐదారు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల రూపంలో సందడి చేస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది.
వచ్చే వారంలో ఎస్ఎంఈ విభాగం నుంచి కేవలం రెండు కంపెనీలు మాత్రమే ఐపీఓలకు రానున్నాయి. అంతేకాదు ఒక్క సంస్థ మాత్రమే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కానుంది.
Details
సూపర్ ఐరన్ ఫౌండ్రీ ఐపీఓ
కాస్టింగ్, ఫౌండ్రీ విభాగంలో కీలక స్థానం ఉన్న 'సూపర్ ఐరన్ ఫౌండ్రీ' ఐపీఓ మార్చి 11న ప్రారంభంకానుంది. ఈ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్ నుంచి రూ.68.05 కోట్ల నిధులను సమీకరించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.
ఇష్యూలో భాగంగా 60.01 లక్షల తాజా షేర్లను జారీ చేయనున్నారు. కంపెనీ ధరల శ్రేణిని రూ.108గా నిర్ణయించింది.
ఈ ఐపీఓ మార్చి 13న ముగియనుండగా మార్చి 17న షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కానున్నాయి.
ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను రుణాల చెల్లింపు, కార్పొరేట్ వృద్ధి కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది.
Details
పీడీపీ షిప్పింగ్ ఐపీఓ
పీడీపీ షిప్పింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.12.65 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పబ్లిక్ ఇష్యూకి మార్చి 10న ప్రారంభమై మార్చి 12న ముగియనుంది. కంపెనీ ఐపీఓ ఇష్యూ ధర రూ.135 గా నిర్ణయించగా, ఇందులో 9.37 లక్షల తాజా షేర్లను జారీ చేయనుంది.
ఈ షేర్లు మార్చి 18న దలాల్ స్ట్రీట్‌లో లిస్ట్ కానున్నాయి. సమీకరించిన నిధులను సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనుంది.
ఎన్‌ఏపీఎస్ గ్లోబల్ ఇండియా లిస్టింగ్
ప్రముఖ వస్త్ర దిగుమతిదారు ఎన్‌ఏపీఎస్ గ్లోబల్ ఇండియా షేర్లు మార్చి 10న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కానున్నాయి.