
Gold Rates: బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. నేడు తులం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. ముఖ్యంగా తులం బంగారంపై రూ.170 మేర పెరుగుదల కనిపించింది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాము ధర రూ.10,180గా ఉంది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాము ధర రూ.9,265గా ట్రేడవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.150 పెరిగింది. దీంతో తాజా ధర రూ.92,650కి చేరుకుంది. ఇదే సమయంలో, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.170 పెరిగి, రూ.1,01,080 వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
కిలో వెండి పై రూ.1,000 పెరిగింది.
విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. అక్కడ 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.92,800గా ఉంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.1,01,210 వద్ద ట్రేడవుతోంది. ఇంకా, ఈ రోజు వెండి ధరలోనూ భారీ పెరుగుదల కనిపించింది. కిలో వెండి పై రూ.1,000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,22,000గా ఉంది. ఢిల్లీలో మాత్రం కిలో వెండి ధర రూ.1,12,000 వద్ద ట్రేడవుతోంది.