
Gold : మహిళకు బాడ్ న్యూస్.. రూ.1600 పెరిగిన గోల్డ్ ధర.. రూ.1100 పెరిగిన సిల్వర్
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ, ఎప్పుడో ఊహించలేని స్థాయికి చేరుకున్నాయి. నేడు మరోసారి భారీ పెరిగి షాక్ ఇచ్చాయి.ఒక్క రోజే తులం బంగారం ధర రూ. 1,640 పెరిగింది. ఇదే విధంగా,వెండి ధర కూడా పెరిగింది. నేడు కిలో వెండి ధరలో రూ. 1,100 వృద్ధి రికార్డు అయ్యింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) ఇప్పుడు రూ. 10,495కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,620 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,500 పెరిగి, మొత్తం రూ. 96,200 వద్ద అమ్ముడవుతోంది.
వివరాలు
దేశంలోని వివిధప్రాంతాలలో ధరలు
ఇప్పటి వరకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,640 పెరిగి, రూ. 1,04,950 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కూడా ఈ ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96,350కు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,100 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక వెండి మార్కెట్ విషయానికి వస్తే, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,31,000 వద్దగా ఉండగా, ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,21,000 వద్ద ట్రేడింగ్ అవుతోంది.