
Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్ .. భారీగా తగ్గిన బంగారం ధరలు..
ఈ వార్తాకథనం ఏంటి
నిన్న ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు ఈరోజు మాత్రం కొంతవరకు ఊరటనిచ్చాయి. శుక్రవారం పసిడి ధరల్లో గణనీయమైన తగ్గుదల చోటు చేసుకుంది. ఈ రోజు తులం బంగారం ధర రూ.600 మేర తగ్గింది. వెండి ధరలు కూడా ఇదే దారిలో పయనించాయి. ఆషాఢ మాసం కాలంలో బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లో ఈరోజు బులియన్ మార్కెట్ ధరల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,873గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.9,050గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి ప్రస్తుతం రూ.90,500కి చేరింది.
వివరాలు
వివిధ నగరరాలలో బంగారం,వెండి ధరలు
ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గడంతో, అది ప్రస్తుతం రూ.98,730 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నట్టు సమాచారం. ఢిల్లీ వంటి దేశ రాజధానిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.90,650గా ఉంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,880 వద్దకు చేరుకుంది. వెండి ధరల విషయానికి వస్తే, ఇవాళ భారీగా కోత ఏర్పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,000 తగ్గి రూ.1,20,000 వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కిలో వెండి ధర రూ.1,10,000 వద్ద ట్రేడవుతోంది.