Page Loader
Gold rate: హోలీ వేళ పసిడి ప్రియులకు షాక్.. రూ. 1,200 పెరిగిన తులం గోల్డ్ ధర
హోలీ వేళ పసిడి ప్రియులకు షాక్.. రూ. 1,200 పెరిగిన తులం గోల్డ్ ధర

Gold rate: హోలీ వేళ పసిడి ప్రియులకు షాక్.. రూ. 1,200 పెరిగిన తులం గోల్డ్ ధర

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోలీ పండుగ సమయంలో బంగారం ప్రియులకు నిరాశ కలిగించే వార్త ఎదురైంది. బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ముఖ్యంగా, శుభకార్యాలకు పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి పెరిగిన ధరలు పెద్ద చిక్కుగా మారాయి. స్థిరంగా పెరుగుతూ, అందని ద్రాక్షలా మారిపోతోంది బంగారం. నేటి మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తే, ఒక్క రోజులోనే తులం బంగారం ధర రూ. 1200 మేర పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, దీనివల్ల కొనుగోలుదారులకు తీవ్రమైన షాక్ తగులుతోంది.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు 

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,978, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,230 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,100 పెరిగి రూ. 82,300 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 89,780 చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 89,930 వద్ద ట్రేడ్ అవుతోంది.

వివరాలు 

సిల్వర్ ధరలు కూడా పెరుగుదల 

బంగారంతో పాటు వెండి ధరలు కూడా నేడు గణనీయంగా పెరిగాయి. కిలో వెండి పై ఏకంగా రూ. 2,000 పెరిగింది, దీంతో వెండికి కూడా బంగారం రేంజ్‌లో డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,000 పెరిగి రూ. 1,12,000కి చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,03,000 వద్ద కొనసాగుతోంది.