
Gold Rates: అక్షయ తృతీయ వేళ స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి..
ఈ వార్తాకథనం ఏంటి
అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.
ఈ ప్రత్యేక దినం సందర్భంగా బంగారం ధరలు స్వల్పంగా పడిపోయాయి.
ఇవాళ పసిడి పై తులం ధర రూ. 60 మేర తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ. 9,791గా, 22 క్యారెట్ల బంగారం(1 గ్రాము)ధర రూ. 8,975గా నమోదైంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గి రూ. 89,750 వద్ద అమ్మకాలుకు అందుబాటులో ఉంది.
అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60 తగ్గి రూ. 97,910 వద్ద ట్రేడ్ అవుతోంది.
వివరాలు
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,900
ఈ ధరలు విజయవాడ, విశాఖపట్టణం మార్కెట్లలో కూడా వర్తిస్తున్నాయి.
ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,900గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 98,040గా ట్రేడ్ అవుతోంది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా పడిపోయాయి.
ఈ రోజు వెండి ధరలో పెద్ద ఎత్తున తగ్గుదల నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర ఏకంగా రూ. 2,000 తగ్గి రూ. 1,09,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 500 తగ్గి రూ. 1,00,000 వద్ద ఉంది.