LOADING...
Trump Tariff War : ట్రంప్ టారిఫ్ వార్.. భారతదేశ జీడీపీ వృద్ధి 1% తగ్గే అవకాశం 
ట్రంప్ టారిఫ్ వార్.. భారతదేశ జీడీపీ వృద్ధి 1% తగ్గే అవకాశం

Trump Tariff War : ట్రంప్ టారిఫ్ వార్.. భారతదేశ జీడీపీ వృద్ధి 1% తగ్గే అవకాశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జులై 31న 60 కి పైగా దేశాలకు టారిఫ్ విధించిన సమయంలో భారత్‌పై 25 శాతం టారిఫ్ అమలు చేశారు. ఆ తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొన్నందుకు అదనంగా మరో 25 శాతం టారిఫ్ విధించడంతో , మొత్తం టారిఫ్ 50 శాతానికి చేరింది. బ్లూమ్‌బెర్గ్ ఎకానామిక్స్ అంచనాల ప్రకారం,అత్యంత తీవ్ర పరిస్థితుల్లో భారత్ జీడీపీ వృద్ధి 1.1శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. సముద్ర ఆహారాలు(రొయ్యలు)పండ్లు,పచ్చిమిరప,పత్తి వస్త్రాల రంగాలు ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశముంది. ఈరంగాలు తక్కువ కాలం నిల్వ ఉండే వస్తువులు కావడంతో పాటు,లాభాల పరంగా కూడా తక్కువ ఉంటాయి. ఇక్కడ వేలాది కుటుంబాలు ఉపాధి పొందినందున,ఇవి దెబ్బతింటే ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపవచ్చు.

వివరాలు 

జీడీపీ వృద్ధి 1.1 శాతం తగ్గే అవకాశం

బ్లూమ్‌బెర్గ్ ఎకానామిక్స్ అంచనా ప్రకారం,ట్రంప్ 50శాతం టారిఫ్ వల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అమెరికాకు చేసే ఎగుమతులు 60శాతానికి తగ్గి, జీడీపీ వృద్ధి 1 శాతం పడిపోవచ్చు. మరింత లోతైన అంచనాల్లో, ఫార్మాస్యూటికల్స్,ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలపై కూడా 50 శాతం టారిఫ్ విధిస్తే, మధ్యమ కాలంలో జీడీపీ వృద్ధి 1.1 శాతం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చేతన కుమార్, ఆడమ్ ఫరార్ తెలిపారు.

వివరాలు 

జీడీపీ వృద్ధి 0.4 నుంచి 0.8 శాతం వరకు తగ్గచ్చు 

మొర్గన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, 12 నెలల పాటు ఈ 50 శాతం టారిఫ్ కొనసాగితే జీడీపీ వృద్ధి 0.4 నుంచి 0.8 శాతం వరకు తగ్గొచ్చని అంచనా. అయితే, దీర్ఘకాలికంగా ఈ టారిఫ్ ఉంటే, ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుని మద్దతు ఇవ్వడం వల్ల అత్యంత తీవ్ర పరిస్థితి తక్కువనే అనుకున్నారు. గోల్డ్‌మాన్ సాక్స్ 0.6 శాతం వృద్ధి కోత అంచనా వేస్తే , సిటిగ్రూప్ జీడీపీ వృద్ధి 0.6 నుంచి 0.8 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.