LOADING...
Trump Traiffs:నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు .. ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం  
నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు

Trump Traiffs:నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు .. ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

భారీ టారిఫ్‌లు విధిస్తూ ఇప్పటికే అనేక దేశాలకు ఆర్థికంగా షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఇప్పటివరకు అమెరికా దిగుమతులపై అమలులో ఉన్న ఉక్కు,అల్యూమినియం టారిఫ్‌ను 25 శాతం నుండి నేరుగా 50 శాతానికి పెంచారు. ఈ పెంపు జూన్ 4 నుంచి అమల్లోకి రానున్నట్టు ట్రంప్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ చర్యకు గల కారణాన్ని వివరించిన ట్రంప్,అమెరికా జాతీయ భద్రతతో పాటు,దేశీయ పరిశ్రమల అభివృద్ధి దృష్ట్యా ఇది అత్యవసరంగా తీసుకున్న నిర్ణయమని స్పష్టంచేశారు. అయితే, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకె)తో వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం అమలులో ఉండటంతో, ఆ దేశానికి మాత్రం 25 శాతం టారిఫ్‌నే కొనసాగిస్తామని కూడా ఆయన వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు