
Direct to Mobile Phones: ఇంటర్నెట్ లేకుండా మొబైల్‌లో టీవీ.. డీ2ఎం టెక్నాలజీతో కొత్త ఫోన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
మొబైల్‌లో టీవీ చూడాలంటే సాధారణంగా మొబైల్ డేటా లేదా వైఫై కనెక్షన్ అవసరం. కానీ ఇప్పుడు ఈ అవసరం లేకుండా కూడా మొబైల్ టీవీ ప్రసారాలు చూడగలిగే కొత్త టెక్నాలజీ రానుంది.
హెచ్‌ఎండీ సంస్థ, ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్ ఇతర కంపెనీలు కలిసి డీ2ఎం (డైరెక్ట్-టు-మొబైల్) ఫోన్‌ను మార్కెట్లో తీసుకురాబోతున్నాయి.
ఈ మొబైల్ ఫోన్లు ఏవీ వైఫై లేదా డేటా అవసరం లేకుండా టీవీ ప్రసారాలను అందిస్తాయి.
నోకియా పేరుతో ఫోన్లు తయారుచేసే హెచ్‌ఎండీ సంస్థ, ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్, తేజస్ నెట్‌వర్క్స్, సింక్లెయిర్‌లతో కలిసి ఈ డీ2ఎం ఫోన్‌ను రూపొందించింది. లావా ఇంటర్నేషనల్ కూడా ఈ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేయనుంది.
Details
ఇంటర్నెట్
ఈ ఫోన్‌లు ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. దీంతో టీవీ ప్రసారాలు లేదా అత్యవసర హెచ్చరికలను స్వీకరించడం సాధ్యమవుతుంది.
ఈ టెక్నాలజీ ద్వారా, మొబైల్ ఫోన్లలో టీవీ ప్రసారాలు ఎఫ్‌ఎం రేడియో ప్రసారాల తరహాలో అందిస్తాయి. వైఫై, ఇంటర్నెట్ లాంటి కనెక్షన్లకు అవసరం లేకుండా, ఈ ఫోన్లు పర్యవేక్షణను ఎఫ్‌ఎమ్ రేడియోలా అందిస్తాయి.
ఈ విధంగా, మొబైల్ టీవీ ప్రసారాలు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. ఈ టెక్నాలజీని ఇప్పటికీ పలు నగరాల్లో ప్రయోగాలు చేస్తున్నాయి.
మే 1 నుంచి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో 2025 WAVES ఈవెంట్‌లో ఈ ఫోన్లను ప్రదర్శించనున్నారు.