LOADING...
Urban Company IPO: లిస్టింగ్‌లో 58 శాతం ప్రీమియంతో దూకుడుగా అరంగేట్రం చేసిన అర్బన్ కంపెనీ 
లిస్టింగ్‌లో 58 శాతం ప్రీమియంతో దూకుడుగా అరంగేట్రం చేసిన అర్బన్ కంపెనీ

Urban Company IPO: లిస్టింగ్‌లో 58 శాతం ప్రీమియంతో దూకుడుగా అరంగేట్రం చేసిన అర్బన్ కంపెనీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

హోమ్‌ సర్వీసెస్‌ సదుపాయాలను యాప్‌ ద్వారా అందించే అర్బన్ కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో భిన్నమైన రికార్డులను సృష్టించాయి. బుధవారం షేర్లు ప్రారంభమైనప్పుడు 57.8శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఐపీఓ ఇష్యూ ధర రూ.103గా ఉండగా,ఎన్‌ఎస్‌ఈలో షేర్లు రూ.162.25 వద్ద ప్రారంభించాయి. రూ.1900కోట్లు సమీకరించేందుకు ఆ కంపెనీ ఈ ఐపీఓని ఈనెల 12 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచింది. చివరి రోజైన గత శుక్రవారం నాటికి,ఐపీఓ 103.63 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్‌ అయింది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం,పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా 10 కోట్ల షేర్లకు 1106 కోట్ల బిడ్లు దాఖలు అయ్యాయి. విభిన్న కేటగిరీల ప్రకారం,క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 140.20రెట్లు,నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 74.04రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 39.25రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది.

వివరాలు 

బుక్ రన్నింగ్‌ మేనేజర్లుగా..

కంపెనీ ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను టెక్నాలజీ అభివృద్ధి, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పెంపు, కార్యాలయాల లీజ్ చెల్లింపులు, మార్కెటింగ్‌ కార్యకలాపాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గన్ స్టాన్లీ ఇండియా, గోల్డ్‌మన్ శాక్స్ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్ వంటి కంపెనీలు బుక్ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.