Page Loader
Upcoming IPOs: జనవరి 4వ వారంలో ఐపీఓల హవా.. 4 సబ్‌స్క్రిప్షన్లు, 7 లిస్టింగ్‌లు
జనవరి 4వ వారంలో ఐపీఓల హవా.. 4 సబ్‌స్క్రిప్షన్లు, 7 లిస్టింగ్‌లు

Upcoming IPOs: జనవరి 4వ వారంలో ఐపీఓల హవా.. 4 సబ్‌స్క్రిప్షన్లు, 7 లిస్టింగ్‌లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2025
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

జనవరి నాలుగో వారంలో ఐపీఓల దూకుడు కొనసాగనుంది. మార్కెట్ నుండి నిధులు సమీకరించేందుకు డెంటా వాటర్‌తో పాటు మూడు సంస్థలు ఎస్‌ఎంఈ విభాగం నుంచి తమ పబ్లిక్‌ ఇష్యూను ప్రవేశపెట్టనున్నాయి. మరో 7 కంపెనీలు దలాల్‌ స్ట్రీట్‌లో తమ షేర్లను లిస్ట్ చేయనున్నాయి. డెంటా వాటర్ అండ్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ మెయిన్ బోర్డ్‌ నుంచి తొలి పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే అవకాశం ఉంది. ఐపీఓ ద్వారా రూ.220.50 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇష్యూలో 75,00,000 తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ధర శ్రేణి రూ.279-294గా నిర్ణయించారు. ఇష్యూ 22వ తేదీ ప్రారంభమై 24వ తేదీ ముగియనుంది.

Details

క్యాపిటల్‌ నంబర్స్‌ ఇన్ఫోటెక్‌ 

ఐపీఓ ద్వారా రూ.169.37 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధరల శ్రేణి రూ.250-263గా నిర్ణయించారు. సబ్‌స్క్రిప్షన్ జనవరి 20న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఈ ఐపీఓలో 32.20 లక్షల తాజా షేర్లు జారీ చేయనున్నారు. షేర్లు జనవరి 27న మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. రెక్స్‌ప్రో ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ ద్వారా రూ.53.65 కోట్లు సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో 32.50 లక్షల తాజా షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 4.50 లక్షల షేర్లు జారీ చేయనున్నారు. బిడ్డింగ్‌ విండో జనవరి 22న ప్రారంభమై 24న ముగియనుంది. ధర శ్రేణి రూ.145.

Details

 జేబీ లాజిస్టిక్స్‌ కామర్స్‌ లిమిటెడ్‌ 

రూ.24.58 కోట్లు సమీకరించాలనే ఉద్దేశంతో జనవరి 24న ప్రారంభమయ్యే సబ్‌స్క్రిప్షన్ 28న ముగుస్తుంది. ధర శ్రేణి ఇంకా ప్రకటించలేదు. లక్ష్మి డెంటల్‌ లిమిటెడ్‌ జనవరి 20న లిస్ట్‌ అవుతుంది. కాబ్రా జ్యువెల్స్‌, రిషబ్ సెక్యూరిటీస్‌ 22న, ల్యాండ్‌మార్క్ ఇమిగ్రేషన్‌, స్టాలిన్‌ ఇండియా ఫ్లోరోకెమికల్స్‌ 23న, ఈఎంఏ పార్ట్‌నర్స్ 24న లిస్ట్ కానుంది. ఈ రోజుల్లో ఐపీఓల రేట్లు, పెట్టుబడుల ప్రక్రియ మార్కెట్‌లో చురుగ్గా కొనసాగుతున్నాయి.