ఫర్నిచర్ వేలం నుండి తగ్గుతున్న ఆదాయం వరకు అసలు ట్విట్టర్ లో ఏం జరుగుతుంది
శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో మిగులు వస్తువులను వేలం వేసి కొంత డబ్బును సేకరించే పనిలో ఉంది ట్విట్టర్. మిగులు కార్యాలయ వస్తువులను విక్రయించడం వలన ట్విట్టర్ ఆదాయం పెరగొచ్చు. హెరిటేజ్ గ్లోబల్ పార్టనర్స్ ఇంక్. (HGP) నిర్వహించిన వేలం 27 గంటలు కొనసాగింది. పక్షి విగ్రహంతో సహా చాలా వస్తువులు $25 ప్రారంభ బిడ్ తో మొదలయ్యాయి. వేలంలో ట్విట్టర్ పక్షి విగ్రహం $100,000 అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. రెండవ అత్యంత ఖరీదైన వస్తువు 10-అడుగుల నియాన్ ట్విట్టర్ బర్డ్ డిస్‌ప్లే $40,000. '@' గుర్తు ఆకారంలో ఉన్న ఒక ప్లాంటర్‌ను $15,000 ధర పలికింది. బీర్ నిల్వ చేయడానికి మూడు కెజిరేటర్లు, ఒక ఫుడ్ డీహైడ్రేటర్ ఒక్కొక్కటి $10,000కి అమ్ముడుపోయాయి.
ఈ సంస్థ ఆండ్రాయిడ్‌లో ట్విట్టర్ బ్లూను ప్రారంభించింది
ట్విట్టర్‌లోని 30 మంది అగ్ర ప్రకటనదారులలో 14 మంది ప్రకటనలను నిలిపివేశారు. ప్రకటనల ఆపివేత కారణంగా ట్విట్టర్ సంవత్సర ఆదాయం 40% పడిపోయినట్లు తేలింది. ట్విట్టర్‌లో ప్రకటన వ్యయాన్ని నిలిపివేసిన లేదా తగ్గించిన కంపెనీలలో కోకా-కోలా, HBO, క్రాఫ్ట్ హీన్జ్, టార్గెట్ వంటి సంస్థలు ఉన్నాయి. ట్విట్టర్ ప్రకటనలపై ఖర్చు పెంచినవారిలో ఆపిల్, PepsiCo, అమెజాన్ ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ ఆండ్రాయిడ్‌లో ట్విట్టర్ బ్లూను ప్రారంభించింది. వెబ్‌లో సేవకు నెలకు $8 ఖర్చవుతుంది. ఐఫోన్ వినియోగదారుల లాగానే, ఆండ్రాయిడ్ యాప్ వినియోగదారులు నెలకు $11 చెల్లించాలి. గూగుల్ ప్లే ద్వారా డౌన్లోడ్ చేసినప్పుడు అదనంగా $3 పడుతుంది. వెబ్ వినియోగదారుల కోసం కంపెనీ $84 విలువైన వార్షిక ప్రణాళికను కూడా ప్రవేశపెట్టింది.