Page Loader
Budget 2025: బడ్జెట్‌లో జీడీపీ వృద్ధికి ఊతం ఇచ్చేలా చర్యలు..ఇప్పుడు ఆశలన్నీ దీనిపైనే! 
బడ్జెట్‌లో జీడీపీ వృద్ధికి ఊతం ఇచ్చేలా చర్యలు..ఇప్పుడు ఆశలన్నీ దీనిపైనే!

Budget 2025: బడ్జెట్‌లో జీడీపీ వృద్ధికి ఊతం ఇచ్చేలా చర్యలు..ఇప్పుడు ఆశలన్నీ దీనిపైనే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోదీ ప్రభుత్వానికి మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత, ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి పెరిగింది. దేశ వృద్ధి అంచనాలు తగ్గుతున్న తరుణంలో, ఈ పరిస్థితిని తిరిగి మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం అత్యవసరం. ముఖ్యంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంపై దృష్టి సారించడం అనేది ప్రధాన టాస్క్. ఈ దిశగా, వేతన జీవులకు ఊరట కల్పించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇంకా, అన్ని వర్గాల వినియోగాన్ని పెంచేందుకు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

వివరాలు 

వేతన జీవులకు పన్ను ఊరట.. ఆర్థిక వ్యవస్థకు ఊతం

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతం ఉండాలని కేంద్ర గణాంక కార్యాలయం అంచనా వేసింది. గత సంవత్సరంలో ఇది 8.2 శాతంగా ఉంది. దేశీయ వృద్ధి అంచనాలు నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి చేరిన వేళ, నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, వేతన జీవులకు పన్ను ఊరట కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకటి, ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసి వృద్ధికి చర్యలు తీసుకోవడం సవాలుగా ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

వినియోగం ఎందుకు కీలకం 

వినియోగ వ్యయానికి, దేశాభివృద్ధికి నేరుగా సంబంధం ఉంది. వినియోగం పెరగడం అంటే వస్తుసేవల ఉత్పత్తి విస్తృతం కావడం. ఆ ఉత్పత్తి పెరుగుతుంటే, పరిశ్రమలు కార్మిక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. వారి ఆదాయాలు పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ ప్రక్రియలో, స్థూల దేశీయోత్పత్తి (GDP) పెరుగుతుంది. అంతేకాక, మౌలిక వసతులపై పెట్టుబడులు పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు.

వివరాలు 

ఆదాయాలు పెరగాలంటే..? 

వృద్ధి చర్యలు చేపట్టే అంచనాలతో వేతన జీవులకు ఈ సారి బడ్జెట్‌ లో మంచి ఊరట ఇవ్వాలని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో శ్లాబుల సవరణ, రిబేట్‌ పెంపు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంపు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో ఉన్న రూ.75 వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని రూ.1 లక్షకు పెంచాలని కోరుతున్నారు. దీని వల్ల, పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా మారుతుందని చెబుతున్నారు.

వివరాలు 

వ్యవసాయం విభాగం 

దేశ జీడీపీలో వ్యవసాయ విభాగం వాటా 15 శాతమే. మొత్తం ఉపాధిలో 45 శాతాన్ని వ్యవసాయం కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో వినియోగం పెంచేందుకు, వ్యవసాయం మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా, ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద ఇస్తున్న నగదును రూ.6 వేలు నుంచి రూ.12 వేలకు పెంచాలని డిమాండి ఉంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకున్న ఈ పథకం కింద నిధులను రూ.10వేలకు పెంచడం కోసం అంచనాలు ఉన్నాయి.

వివరాలు 

మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు 

జీడీపీ వృద్ధికి మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. గత బడ్జెట్‌లో రూ.11 లక్షల కోట్లను కేటాయించిన ప్రభుత్వం, ఈ సారి ఆ నిధులను రూ.12 లక్షల కోట్లకు పెంచాలని సూచిస్తున్నారు. ప్రతి బడ్జెట్‌లో మౌలిక రంగానికి భారీ కేటాయింపులు ఉన్నా, ఆ నిధులు పూర్తిగా ఖర్చు చేయడంలో విఫలమవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

గిగ్‌ వర్కర్లు 

దేశంలో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల సంఖ్య పెరుగుతోంది. వీరికి ఉద్యోగ, సామాజిక భద్రత అందించడం లేదు. 2029-30 కల్లా ఈ సంఖ్య 2.35 కోట్లకు చేరుకుంటుందని నీతి ఆయోగ్‌ నివేదిక తెలిపింది. వీరికి బీమా, పెన్షన్‌ వంటి సదుపాయాలు కల్పించడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

నిరుద్యోగం సమస్య 

మన దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉంది. యువత మన బలంగా ఉన్నప్పటికీ, వారిని ఉత్పత్తి ప్రక్రియలో భాగం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనతో, జీడీపీ పెరుగుతుందని అనేక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఈ సారి బడ్జెట్‌లో తీసుకోబడే నిర్ణయాలు ఏంటి అనేది చూడాలి.