Page Loader
Digi Yatra: పన్ను ఎగవేతదారులను లక్ష్యంగా చేసుకోవడానికి డిజి యాత్ర డేటా ఉపయోగించబడుతుందా?.. ఈ వార్తలో నిజమెంత?
పన్ను ఎగవేతదారులను లక్ష్యంగా చేసుకోవడానికి డిజి యాత్ర డేటా ఉపయోగించబడుతుందా?.. ఈ వార్తలో నిజమెంత?

Digi Yatra: పన్ను ఎగవేతదారులను లక్ష్యంగా చేసుకోవడానికి డిజి యాత్ర డేటా ఉపయోగించబడుతుందా?.. ఈ వార్తలో నిజమెంత?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2024
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది, ప్రస్తుతం నగదు చెల్లింపుల నుండి టికెట్ల బుకింగ్ వరకు చాలా విషయాలు ఫోన్‌లోనే జరుగుతున్నాయి. అయితే, స్మార్ట్‌ఫోన్ ఉపయోగం వల్ల గోప్యతకి సంబంధించిన ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం అజ్ఞాత వ్యక్తుల చేతుల్లోకి చేరుతుందనే భయం ఉంది. ఈ నేపథ్యంలో, డిజి యాత్ర యాప్‌ పై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.

వివరాలు 

ఐటీ శాఖ నుండి నోటీసులు వచ్చే అవకాశం

డిజి యాత్ర యాప్‌కు సంబంధించి "పన్ను ఎగవేతదారుల కోసం డిజి యాత్ర డేటాను ఆదాయపన్ను శాఖ ఉపయోగించుకోనున్నది" అనే కథనం 2023 డిసెంబర్ 30న ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైంది. ఈ కథనంలో, "మీరు డిజి యాత్ర యాప్‌ను తరచూ ఉపయోగించినా, ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఫైల్ చేయకుంటే, ఐటీ శాఖ నుండి నోటీసులు వచ్చే అవకాశం ఉంది" అని చెప్పబడింది. ఈ కథనం ప్రకారం, డిజి యాత్ర యాప్‌లో నమోదైన ప్రయాణికుల డేటాను ఆదాయ పన్ను శాఖ యాక్సెస్ చేసి, పన్ను ఫైలింగ్‌లతో ఈ డేటాను సరిచూసుకుని, వ్యత్యాసాలను గుర్తించడం మొదలుపెట్టిందని చెప్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం ఇదే..

వివరాలు 

ఐటీ శాఖ, పన్ను రిటర్న్‌లను దాఖలు చేయనివారే లక్ష్యం

డిజి యాత్ర యాప్‌ను పౌర విమానయాన శాఖ, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో రూపొందించింది. దీనిలో ప్రయాణికుల ID, బయోమెట్రిక్ సమాచారం, విమాన టిక్కెట్ల వివరాలు సేకరించి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అయితే, ఈ యాప్‌ను ఉపయోగించడం ఎవరూ తప్పనిసరి కాదు. ఐటీ శాఖ, పన్ను రిటర్న్‌లను దాఖలు చేయనివారిని ముందుగా లక్ష్యంగా పెట్టుకుంటుందన్నది కథనంలో సూచించబడింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఎక్కువ ఖర్చులు చేసే వారు, తమ ఆదాయాన్ని సరైన రీతిలో డిక్లేర్ చేయకపోతే, వారి పై మరింత లోతైన పరిశీలన జరగవచ్చని అంటున్నారు.

వివరాలు 

ఈ యాప్‌ను 2024 నాటికి 9 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు 

ఈ కథనాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో , డిజి యాత్ర సీఈవో సురేశ్ ఖడకభవి స్పందించారు. "డిజి యాత్ర అనేది వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని ఏ సెంట్రల్ రిపాజిటరీలోనూ ప్రాసెస్ చేయదు" అని తెలిపారు. డేటా చోరీ, పంచుకోవడం, లీక్ అవ్వడం వంటి వాటి అవకాశం లేకుండా, ఈ యాప్ పూర్తిగా డిసెంట్రలైజ్ పద్ధతిలో పనిచేస్తుందని వివరించారు. డిజి యాత్ర ప్రస్తుతానికి దేశీయ ప్రయాణికులకే అందుబాటులో ఉందని, అంతర్జాతీయ ప్రయాణాలకు ఇంకా అందుబాటులో లేదని తెలిపారు. 2024 నాటికి 9 మిలియన్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డిజి యాత్ర సీఈవో సురేశ్ ఖడకభవి చేసిన ట్వీట్ 

వివరాలు 

ఎక్స్ వేదికగా స్పదించిన ఆదాయపన్ను శాఖ

ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ కూడా స్పందించి, "ఇలాంటి చర్యలు చేపట్టడం లేదని" స్పష్టం చేసింది. "ఈ యాప్‌లో బయోమెట్రిక్ వివరాలు లేదా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం కోసం సెంట్రల్ స్టోరేజ్ ఏదీ లేదు" అని పేర్కొన్నారు. ఫేషియల్ అథెంటికేషన్ డీసెంట్రలైజ్డ్‌గా ఉంటుంది. 90 లక్షలకుపైగా యూజర్లు, 4.2 కోట్లకుపైగా సురక్షిత ప్రయాణాలు. గోప్యత విషయంలో రాజీ లేదు' అని డిజి యాత్ర సీఈవో తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆదాయపన్ను శాఖ చేసిన ట్వీట్