భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్ తయారీదారుగా టాటా గ్రూప్
బెంగళూరు సమీపంలోని అసెంబ్లింగ్ ప్లాంట్ విక్రయానికి Wistron Corp ఆమోదం తెలిపిన తర్వాత టాటా గ్రూప్ త్వరలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటించారు. దింతో బాటుగా కేంద్ర మంత్రి విస్ట్రాన్ జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనను జతపరిచారు. విస్ట్రోన్ ఇన్ఫోకామ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌ను టాటాకు $125 మిలియన్లకు విక్రయించడానికి బోర్డు ఆమోదాన్ని కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో ధృవీకరించింది. దింతో భారతదేశంలో ఐఫోన్‌లను తయారు చేసే మొదటి భారతీయ సంస్థగా టాటా గ్రూప్ అవతరించనుంది.