ఈనెల 15 నుంచి ఐపీఓలోకి యాత్ర ఆన్‌లైన్.. ఒక్కో లాట్‌కు ఎంత పెట్టాలో తెలుసా
ప్రయాణ సేవలు అందించే యాత్ర ఆన్‌లైన్, సెప్టెంబర్ 15న ఐపీఓకు వెళ్లనుంది. స్టాక్ మార్కెట్ లో బీఎస్‌ఈ,ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కానుంది. సెప్టెంబర్ 15 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి వస్తుండగా, 20న సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. అయితే ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.135-142గా కంపెనీ నిర్ణయించింది. సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే కనిష్ఠంగా రూ.105 ఈక్విటీ షేర్లకు (ఒక్కో లాట్‌కు) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే గరిష్ఠ ధర సుమారుగా రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టాలి. ఐపీఓలో భాగంగా రూ.602 కోట్ల విలువైన 1.21 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. దీంతో రూ.775 కోట్లు కంపెనీకి సమకూరనున్నాయి. ఐపీఏ ద్వారా సమకూరిన మొత్తంలో రూ.150 కోట్ల మేర వ్యూహాత్మక పెట్టుబడులు,కొనుగోళ్లకు వినియోగిస్తామని కంపెనీ పేర్కొంది.