
Zomato delivery fee: కొత్తగా 'లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు'ను ప్రారంభించిన ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవ జొమాటో తన వినియోగదారులకు మరో షాకిచ్చింది.నష్టాలను తగ్గించే దిశగా తీసుకొచ్చిన చర్యల భాగంగా, కొత్త విధమైన ఛార్జీలను అమలు చేయడం ప్రారంభించింది.
కొత్తగా 'లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు'ని ప్రవేశపెట్టింది.అంటే,ముందుగా మీరు ఎక్కడున్నారో, ఆ దూరంలోని హోటల్ లేదా రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేసిన ఫుడ్‌కు దూరాన్ని బట్టి అదనపు ఛార్జీలు విధించబడతాయి.
4 కిలోమీటర్ల దూరంలో లేనివారు ఆర్డర్ చేస్తే 'లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు' తప్పనిసరిగా చెల్లించాలి.
రెస్టారెంట్, డెలివరీ అడ్రస్ మధ్య దూరం 4 నుండి 6 కిలోమీటర్ల మధ్య ఉంటే,ఆర్డర్ విలువ రూ.150 కన్నా ఎక్కువ అయితే వినియోగదారుల నుంచి రూ.15 వసూలు చేయనున్నట్టు జొమాటో ప్రకటించింది.
వివరాలు
డిస్టెన్స్ ఛార్జీ, సర్వీస్ ఛార్జీలు 30 శాతం దాటకూడదని జొమాటో సూచనలు
6 కిలోమీటర్ల దూరం దాటితే, ఆర్డర్ విలువను బట్టి కాకుండా నగరం ఆధారంగా సర్వీస్ ఛార్జీ రూ.25 నుంచి రూ.35 వరకు ఉండొచ్చు.
కోవిడ్ మహమ్మారి ముందుకి జొమాటో 4-5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అదనపు ఛార్జీలు విధించలేదు.
అయితే మహమ్మారి సమయంలో అనేక రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతబడిన కారణంగా, డెలివరీ పరిధిని 15 కిలోమీటర్లకు పెంచింది.
తర్వాత ఇది తగ్గుతూ, చివరికి ఇప్పుడు దూరాన్ని బట్టి ఫీజు వసూలు చేసే విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది.
అయితే, రెస్టారెంట్ భాగస్వాములకు ఆర్డర్ విలువకు సంబంధించిన డిస్టెన్స్ ఛార్జీ, సర్వీస్ ఛార్జీలు 30 శాతం దాటకూడదని జొమాటో సూచనలు ఇచ్చింది.
వివరాలు
బ్లింకిట్‌పై భారీగా పెట్టుబడులు
ఇకపోతే, జొమాటో తన క్విక్ కామర్స్ విభాగం అయిన బ్లింకిట్‌పై భారీగా పెట్టుబడులు పెడుతోంది.
ఈ కారణంగానే నష్టాలను తగ్గించుకునే చర్యలలో భాగంగా పలు ఇతర చర్యల్ని కూడా చేపడుతోంది.
ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజులను వసూలు చేస్తూ వస్తున్న ఈ కంపెనీ తాజాగా జొమాటో గోల్డ్ సభ్యులకు రైన్ సర్‌చార్జీ మినహాయింపును కూడా రద్దు చేసింది.
ఈ వార్తల నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్లో జొమాటో షేర్లు లాభదాయకంగా ట్రేడ్ అవుతున్నాయి.
మధ్యాహ్నం 12:40 గంటల సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో జొమాటో షేర్లు 4.20 శాతం లాభంతో రూ.237.55 వద్ద కొనసాగుతున్నాయి.