Cryptocurrency fraud: క్రిప్టో కరెన్సీ మోసం కేసు.. తమన్నా భాటియా,కాజల్ అగర్వాల్‌లను విచారించనున్న పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి సినీతారలు తమన్నా,కాజల్ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు.
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆకర్షించి,పుదుచ్చేరికి చెందిన 10 మంది నుంచి సుమారు రూ.2.40 కోట్లు వసూలు చేసినట్లు అశోకన్ అనే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు.
ఈ క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరులో ప్రధాన కార్యాలయంగా ఏర్పాటైంది.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటి తమన్నా ఇతర ప్రముఖులతో కలిసి హాజరయ్యారు.
వివరాలు
పార్టీ ద్వారా వేలాది మంది నుంచి పెట్టుబడులు
మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన మరో కార్యక్రమానికి నటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారు.
ఆ తరువాత ముంబైలో ఏర్పాటు చేసిన పార్టీ ద్వారా వేలాది మంది నుంచి పెట్టుబడులు సేకరించారు.
ఈ కేసులో నితీష్ జైన్ (36), అరవింద్ కుమార్ (40)లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ అగర్వాల్‌లను విచారించాలని నిర్ణయం తీసుకున్నారు.