Page Loader
year ender 2024: టాలీవుడ్‌ను కుదిపేసిన 2024.. ప్రముఖ స్టార్స్‌పై కేసులు, అరెస్టులు

year ender 2024: టాలీవుడ్‌ను కుదిపేసిన 2024.. ప్రముఖ స్టార్స్‌పై కేసులు, అరెస్టులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 17, 2024
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 సంవత్సరం టాలీవుడ్ సినీ పరిశ్రమకు విషాదాలు, వివాదాలు, పోలీస్ కేసులతో నిండిపోయింది. సినీ సెలబ్రిటీలు అనూహ్యంగా వివాదాల్లో చిక్కుకోవడం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు, కోర్టు కేసులు, జైళ్లలో గడపడం వంటి పరిణామాలు టాలీవుడ్ ప్రతిష్టను దెబ్బతీశాయి. రాజ్‌తరుణ్-లావణ్య వివాదం యంగ్ హీరో రాజ్‌తరుణ్ పై లావణ్య అనే యువతి మోసం చేశాడని ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టాలీవుడ్‌లో రచ్చ పెద్దదైంది. ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆమె చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరిపి, రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా గుర్తించి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

Details

 2. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు 

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచే లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె చేసిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసుతో జానీ మాస్టర్ తన జాతీయ అవార్డును సైతం కోల్పోయాడు. 3. మంచు ఫ్యామిలీ కుటుంబ కలహాలు టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ కలహాలు పెద్ద దుమారాన్ని రేపాయి. మంచు మనోజ్ తన తండ్రి మోహన్‌బాబు, సోదరుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మోహన్‌బాబు కూడా తన కుమారుడిపై ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో ఓ జర్నలిస్టుపై మోహన్‌బాబు దాడి చేసిన ఘటన హత్యాయత్నం కేసుగా నమోదు అయ్యింది.

Details

 4. అక్కినేని నాగార్జున- పరువు నష్టం దావా 

నాగచైతన్య-సమంత విడాకులకు సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున తీవ్రంగా స్పందించారు. పరువు నష్టం దావా వేయడంతో పాటు లీగల్ ఫైట్‌ చేస్తున్నారు. అదనంగా హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కూడా కోర్టులో పోరాడుతున్నారు 5. రాంగోపాల్ వర్మపై కేసు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రాజకీయ నాయకులపై చేసిన అనుచిత పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు వివాదాస్పదమయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను లక్ష్యంగా చేసిన వర్మపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చివరకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన తాత్కాలిక ఊపిరి పీల్చుకున్నారు.

Details

 6. అల్లు అర్జున్ అరెస్ట్

పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయగా, పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. తరువాత తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు.