LOADING...
Collie : 24 గంటల్లో 5.7 లక్షల టికెట్లు.. బాక్సాఫీస్‌పై 'కూలీ' సునామీ కలెక్షన్స్
24 గంటల్లో 5.7 లక్షల టికెట్లు.. బాక్సాఫీస్‌పై 'కూలీ' సునామీ కలెక్షన్స్

Collie : 24 గంటల్లో 5.7 లక్షల టికెట్లు.. బాక్సాఫీస్‌పై 'కూలీ' సునామీ కలెక్షన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ రజనీకాంత్ మాసివ్ రేంజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు రాస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కూలీ' విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, మొదటి రోజే మైండ్‌బ్లోయింగ్ కలెక్షన్స్ సాధించి రికార్డులను తిరగరాసింది. రెండో రోజు కూడా అదే జోష్ కొనసాగిస్తూ ఫ్యాన్స్‌ను సెలబ్రేషన్ మూడ్‌లోకి తీసుకెళ్లింది. తాజాగా బుక్ మై షో విడుదల చేసిన డేటా ప్రకారం, గత 24 గంటల్లోనే 5,72,870 టికెట్లు బుక్ అయ్యాయి. ఈ సంఖ్య నిజంగా మైండ్‌బ్లోయింగ్ రికార్డు. డే 1లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం, డే 2లోనూ అదే రీతిలో రాంపేజ్ చేస్తోంది.

Details

మరింత కలెక్షన్లు సాధించే అవకాశం

రజనీకాంత్ ఎనర్జీ, నాగార్జున స్పెషల్ అట్రాక్షన్, లోకేశ్ కనకరాజ్ మాసివ్ ప్రెజెంటేషన్ కలిసి రావడంతో అభిమానులు ఇప్పటికే 'కూలీ'కి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ ట్యాగ్ కట్టేశారు. 'ఇది మాసివ్ కాదు.. సునామీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు సహా అన్ని భాషల్లోనూ దూసుకుపోతోంది. విడుదలైన ప్రతి షో హౌస్‌ఫుల్ అవ్వడం, అడ్వాన్స్ బుకింగ్స్‌తో థియేటర్లు నిండిపోవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత సెన్సేషన్ సృష్టిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.