Page Loader
సినిమా

95th Oscars Awards Live Updates

Mar 13, 2023, 09:24 am
95th Oscars Awards Live Updates
లైవ్
Mar 13, 2023, 09:22 am

ముగిసిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం

95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ముగిసింది. ఈ అవార్డులు భారతీయులకు చాలా ప్రత్యేకంగా నిలిచాయి. ఉత్తమ పాట విభాగంలో నాటు నాటు పాట, డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ది ఎలిఫెంట్ విష్పర్స్.. ఇండియాకు ఆస్కార్ అవార్డులను తీసుకొచ్చాయి. ఆస్కార్ విజేతలందరికీ అభినందనలు.

Mar 13, 2023, 09:04 am

ఉత్తమ చిత్రం

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం ఉత్తమ ఆస్కార్ చిత్రంగా నిలిచింది. 11నామినేషన్లు పొందిన ఈ చిత్రం, ఇప్పటివరకు 7అవార్డ్స్ అందుకుంది.

Mar 13, 2023, 08:58 am

ఉత్తమ నటి

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రంలో నటించిన మిషెల్లీ యో, ఆస్కార్ ఉత్తమ నటిగా నిలిచింది.

Mar 13, 2023, 08:54 am

ఉత్తమ నటుడు

ద వేల్ చిత్రంలో నటించిన బ్రెండన్ ఫేజర్.. ఆస్కార్ అవార్డ్ అందుకున్నాడు

Mar 13, 2023, 08:43 am

ఉత్తమ దర్శకత్వం

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్ర దర్శకులైన డేనియల్ క్వాన్, డేనియల్ షీనర్ట్ లకు ఆస్కార్ అవార్డు వచ్చింది.

Mar 13, 2023, 08:39 am

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్

Mar 13, 2023, 08:28 am

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్

భారతీయుల కల నెరవేరింది. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ దక్కింది.

Mar 13, 2023, 08:24 am

బెస్ట్ సౌండ్

ఈ విభాగంలో టామ్ క్రూజ్ హీరోగా నటించిన టాప్ గన్ మ్యావ్ రిక్ చిత్రానికి గాను ఆస్కార్ అందింది.

Mar 13, 2023, 08:16 am

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

విమెన్ టాకింగ్ చిత్రానికి గాను ఈ విభాగంలో ఆస్కార్ అందింది.

Mar 13, 2023, 08:12 am

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి గాను ఆస్కార్ వచ్చింది. ఈ చిత్రం అత్యధిక ఆస్కార్ నామినేషన్లు(11) పొందినది.

Mar 13, 2023, 07:55 am

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్

జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతం, అవతార్ ద వే ఆఫ్ వాటర్ చిత్రానికి గాను ఆస్కార్ వచ్చింది.

Mar 13, 2023, 07:44 am

బెస్ట్ ఒరిజినల్ స్కోర్

ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ చిత్రానికిగాను వోల్కర్ బార్టెల్ మాన్ కు ఆస్కార్ దక్కింది.

Mar 13, 2023, 07:40 am

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్

జర్మనీకి చెందిన ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ చిత్రానికి గాను ఈ అవార్డ్ దక్కింది.

Mar 13, 2023, 07:27 am

ఉత్తమ యానిమేషన్ షార్ట్ ఫిలిమ్

ద బోయ్, ద మోల్, ద ఫాక్స్, ద హార్స్ యానిమేషన్ షార్ట్ ఫిలిమ్ కి ఆస్కార్ వచ్చింది.

Mar 13, 2023, 07:23 am

ఆస్కార్ వేదిక మీద ఇండియాకు అవార్డ్

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ఇండియాకు చెందిన ది ఎలిఫెంట్ విష్పర్స్ షార్ట్ ఫిలిమ్ కి అవార్డ్ దక్కింది.

Mar 13, 2023, 07:15 am

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీఛర్ ఫిలిమ్

జర్మనీకి చెందిన ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ చిత్రానికి గాను ఆస్కార్ వచ్చింది.

Mar 13, 2023, 07:07 am

ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట

రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాటను పాడి అందరినీ ఉర్రూతలూగించారు. ఈ పాట పాడుతున్నంత సేపు అక్కడున్న అందరూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. పాట పాడడానికి సింగర్స్ వస్తున్నారంటూ దీపికా పదుకునే పిలవడం మరో విశేషం.

Mar 13, 2023, 06:59 am

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్

బ్లాక్ ఫాంథర్ వాకాండా ఫరెవర్ చిత్రానికి గాను రూత్ కార్టర్ ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు.

Mar 13, 2023, 06:51 am

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్

ద వేల్ చిత్రానికి గాను ఈ అవార్డు దక్కింది. బ్రెండన్ ఫ్రేషర్స్ నటించిన ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Mar 13, 2023, 06:39 am

బెస్ట్ సినిమాటోగ్రఫీ

ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ అనే చిత్రానికి పనిచేసిన జేమ్స్ ఫ్రెండ్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా ఆస్కార్ అందుకున్నారు. ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ అనే చిత్రం 9 నామినేషన్లు గెలుచుకుంది.

Loading...