Page Loader
Kadapa: పవన్ కళ్యాణ్ సొంత నిధులతో మధ్యాహ్న భోజనం కోసం కడపలో స్మార్ట్ కిచెన్..  
పవన్ కళ్యాణ్ సొంత నిధులతో మధ్యాహ్న భోజనం కోసం కడపలో స్మార్ట్ కిచెన్..

Kadapa: పవన్ కళ్యాణ్ సొంత నిధులతో మధ్యాహ్న భోజనం కోసం కడపలో స్మార్ట్ కిచెన్..  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా తన వ్యక్తిగత నిధులను ఉపయోగించి కడప పురపాలక ఉన్నత పాఠశాలలో స్మార్ట్ కిచెన్‌ను నిర్మించారు. ఈ వంటశాల ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని నూతనంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో పనిచేస్తున్న స్మార్ట్ కిచెన్ ఇది దేశంలోనే తొలి ప్రాజెక్టుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వంటశాల నుంచి 12 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 2,200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు. ఈ భోజనాన్ని "డొక్కా సీతమ్మ" పేరుతో రుచికరంగా, శుభ్రంగా, ఆరోగ్యకరమైన పదార్థాలతో అందిస్తున్నారు.

వివరాలు 

ఐదు నక్షత్రాల హోటల్ స్థాయిలో హైటెక్ వంటశాల 

వంట కార్మికులు ప్రత్యేక డ్రెస్ కోడ్ పాటిస్తూ, పూర్తి పరిశుభ్రతతో పనిచేస్తున్నారు. స్మార్ట్ కిచెన్ ఆధునిక వంట సామాగ్రి, ఆటోమేటెడ్ వ్యవస్థలు, ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్‌తో కూడి ఉంది. రెఫ్రిజిరేటర్లు, ఓవెన్లు, ప్రెషర్ కుక్కర్లు వంటి పరికరాలతో వంటకాలు సిద్ధం చేయడం జరుగుతోంది. అందించిన భోజనం వాహనాల ట్రాకింగ్ వ్యవస్థను స్మార్ట్‌ఫోన్ ద్వారానే పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రకారం, ప్రస్తుతం 12 పాఠశాలలకు ఈ కేంద్ర వంటశాల నుంచి భోజనం సరఫరా అవుతున్నప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు ఈ సేవను విస్తరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

ఉపముఖ్యమంత్రిని ప్రభావితం చేసిన కలెక్టర్ ఆలోచన 

గత సంవత్సరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ సమావేశంలో పాల్గొన్న సమయంలో జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్ ప్రతిపాదనను వినిపించారని, దానికై అవసరమైన నిధులను తాను స్వయంగా సమకూర్చినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ వంటశాల ప్రస్తుతం విజయవంతంగా 12 పాఠశాలలకు భోజనాన్ని అందించడాన్ని ఆయన గర్వంగా పేర్కొన్నారు. ఇది ఒక ఆదర్శమయమైన నమూనా అవుతుందని స్పష్టం చేశారు.

వివరాలు 

స్మార్ట్‌ కిచెన్‌ ఆదర్శనీయం.. ఎక్స్‌ వేదికగా ఉపముఖ్యమంత్రి 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్య,ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ తీసుకువస్తున్న మార్పులు మంచి ఫలితాల వైపు నడిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ప్రమాణాలు ఏర్పడటానికి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ అద్దం పడుతున్నాయని చెప్పారు. కడపలోని ఈ స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి సమీక్ష నిర్వహించిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్