Mohan Babu: మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు
టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌బాబు సంబంధించిన వివాదాస్పద ఘటనలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద ఓ చానల్ రిపోర్టర్ మోహన్‌బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఆ రిపోర్టర్ చేతిలోని మైక్‌ను కిందపడేసి దాడి చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి మొదట 118 సెక్షన్ కింద మోహన్‌బాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, తాజా లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్లను మార్చి హత్యాయత్నం ఆరోపణలు (BNS 109) కింద కేసు నమోదు చేశారు.
విజయ్ కోసం గాలింపు చర్యలు
ఇదే కేసులో మంచు మనోజ్ ఫ్యామిలీపై జరిగిన దాడి వ్యవహారం కొత్త కోణంలోకి మారింది. మనోజ్ ఫిర్యాదు ప్రకారం, మోహన్‌బాబు ఆదేశాలతో వెంకట్ కిరణ్, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆయనపై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కిరణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, విజయ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాడి అనంతరం సీసీ ఫుటేజ్, హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో మంచు కుటుంబంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీసాయి.