The Traitors Telugu: బిగ్ బాస్‌కు పోటీగా కొత్త షో.. తేజ సజ్జ హోస్ట్‌గా 'ది ట్రైటర్స్'
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల అన్ని భాషల్లోనూ రియాలిటీ షోలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే 'బిగ్ బాస్' వంటి షోలు మంచి క్రేజ్‌తో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మరో కొత్త రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. హాలీవుడ్, బాలీవుడ్‌లో ఇప్పటికే పాపులర్ అయిన 'ది ట్రైటర్స్' (The Traitors) రియాలిటీ షో ఇప్పుడు తెలుగులోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'ది ట్రైటర్స్' తెలుగు వెర్షన్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ షోకు హీరో తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఒక పెద్ద భవంతిలో 20 మంది సెలబ్రిటీలతో ఈ రియాలిటీ షో కొనసాగనుంది.
వివరాలు
అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్
'ది ట్రైటర్స్' తెలుగు వెర్షన్‌ను అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఇప్పటికే ఇతర భాషల్లో ఆదరణ పొందిన ఈ రియాలిటీ షో తెలుగులో ఎలాంటి స్పందన అందుకుంటుందో ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో 'బిగ్ బాస్'కు ఉన్న హైప్‌ను దృష్టిలో పెట్టుకుంటే.. 'ది ట్రైటర్స్'కు కూడా అదే స్థాయిలో క్రేజ్ వస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. ఈ కొత్త రియాలిటీ షో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.