LOADING...
Aamir Khan: 'కూలీ'లో ఆమిర్‌ ఖాన్ అతిథి పాత్ర.. రెమ్యునరేషన్‌ రూమర్స్‌పై క్లారిటీ!
'కూలీ'లో ఆమిర్‌ ఖాన్ అతిథి పాత్ర.. రెమ్యునరేషన్‌ రూమర్స్‌పై క్లారిటీ!

Aamir Khan: 'కూలీ'లో ఆమిర్‌ ఖాన్ అతిథి పాత్ర.. రెమ్యునరేషన్‌ రూమర్స్‌పై క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2025
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన 'కూలీ' (Coolie)ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో తలైవాతో పాటు అగ్రకథానాయకులు నాగార్జున, ఆమిర్ ఖాన్ (Aamir Khan) ప్రత్యేక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత జోష్‌ తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి వీరి రెమ్యునరేషన్‌ గురించి అనేక రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా అతిథి పాత్రలో కనిపించిన ఆమిర్ ఖాన్ ఏకంగా రూ.20 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని గాసిప్‌ గట్టిగానే వినిపించింది. దీనిపై మూవీ టీమ్‌ స్పష్టత ఇచ్చినా, ఊహాగానాలకు ముగింపు రాలేదు. ఇక తాజాగా ఆమిర్ ఖాన్ ఈ అంశంపై స్పందించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "ఈ సినిమా కోసం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

Details

రజనీతో నటించడమే పెద్ద రివార్డు

రజనీకాంత్‌తో స్క్రీన్‌ పంచుకోవడం నాకు కోట్ల రూపాయల కంటే విలువైనది. ఆయనపై నాకు ఉన్న ప్రేమ, అభిమానానికి డబ్బుతో విలువ కట్టలేం. ఈ సినిమాలో నేను కేవలం అతిథి పాత్రలోనే నటించాను. నిజమైన హీరోలు రజనీకాంత్‌, నాగార్జున. ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నది వారిని చూడడానికే.. నా కోసం కాదని స్పష్టం చేశారు. దీంతో ఆయన రెమ్యునరేషన్‌పై గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలకు పూర్తిగా చెక్‌ పడినట్లైంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆమిర్ ఖాన్ 'దాహా' అనే పాత్రలో నటించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్లు వసూలు చేసిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది.