Page Loader
Fish Venkat: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నటుడు.. ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నటుడు.. ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్

Fish Venkat: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నటుడు.. ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆది సినిమాలో "తొడగొట్టు చిన్న" అనే డైలాగ్‌తో పేరు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్, తన కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా, విలన్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో అనేక సినిమాల్లో నవ్వులు పూయించిన ఫిష్ వెంకట్, ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఒకప్పుడు ఎంతోమందికి సాయం చేసిన ఫిష్ వెంకట్, ప్రస్తుతం రాంనగర్‌లో తన ఇంట్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనను చూడగానే ఎవరైనా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అతని కుడి కాలు పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.

వివరాలు 

పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సహాయం

ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఫిష్ వెంకట్ సమస్యలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఆయనకు వెంటనే రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. పవన్ కళ్యాణ్ సినీ నటుల కోసం చాలా సార్లు ఆర్థిక సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయమై ఫిష్ వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు. తన భార్య మాట విని పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించినట్లు చెప్పారు. తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్, కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నానని ఫిష్ వెంకట్ ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో