Page Loader
Actor Prasahanth:  'వినయ విధేయ రామ' నటుడికి షాకిచ్చిన పోలీసులు
'వినయ విధేయ రామ' నటుడికి షాకిచ్చిన పోలీసులు

Actor Prasahanth:  'వినయ విధేయ రామ' నటుడికి షాకిచ్చిన పోలీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2024
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు, వినయ విధేయ రామ మూవీలో కీలక పాత్రలో నటించిన ప్రశాంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ నటించి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక తాను నటించిన ఓ సినిమా ప్రమోషన్ ను వైరైటీగా ప్లాన్ చేయడంతో ఆ నటుడికి పోలీసులు షాకిచ్చారు. ఇటీవల హెల్మెట్ లేకుండా బుల్లెట్ బండిపై ప్రయాణిస్తూ ఆయన ఓ ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఇక బైక్ నడిపిన హోరీ, వెనుక పిలియన్ రైడర్ కు హెల్మెట్ లేకపోవడంతో పోలీసులు రూ.2000 జరిమానా విధించారు.

Details

సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన పోలీసులు

ఈ విషయాన్ని చైన్నై పోలీసులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాజాగా ప్రశాంత్ అంధగన్ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్ర మరో వారంలో రిలీజ్ కానుంది. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.