LOADING...
Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ
కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ

Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

లోక నాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' విడుదలకు రెడీ అవుతోంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ ఊపందుకోగా, తాజాగా ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్‌లను విడుదల చేశారు. ట్రైలర్ మొత్తంలో కమల్ హాసన్, అభిరామ లిప్‌లాక్ సీన్, అలాగే కమల్, త్రిష మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

Details

సినిమాపై భారీ అంచనాలు

ట్రైలర్‌లో కమల్ చెప్పిన "మేడమ్... ఐ యామ్ ఓన్లీ యువర్ ఆడమ్" అనే డైలాగ్ కు విశేష స్పందన వస్తోంది. త్రిష పాత్ర కూడా గ్లామర్‌తో పాటు భావోద్వేగానికి ఆస్కారం ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తే స్పష్టమవుతోంది. మరోవైపు, అభిరామతో లిప్‌లాక్ సన్నివేశంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అభిరామ స్పందిస్తూ, ''చిత్రనిర్మాతల నిర్ణయాలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ట్రైలర్‌లో కనిపించిన చిన్న క్లిప్ వల్ల అనవసరమైన అపార్థాలు కలుగుతున్నాయి. ఆ ముద్దు సన్నివేశాన్ని నేను సొంతంగా, ఇష్టపూర్వకంగా చేశాను. పూర్తి సినిమా చూసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు మారుతాయని నమ్ముతున్నాను. ఒకవేళ సినిమా విడుదల అయిన తర్వాత ఈ విషయంపై ఎవరూ మాట్లాడరనిపిస్తోందని పేర్కొన్నారు.