ఆదిపురుష్ వివాదం: నేపాల్ లో రెండు నగరాల్లో హిందీ సినిమాలపై నిషేధం; అసలేం జరిగిందంటే?
ఆదిపురుష్ సినిమా రిలీజైన దగ్గరి నుండి ఏదో ఒక వివాదం బయతకు వస్తూనే ఉంది. తాజాగా నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఆదిపురుష్ సినిమాను, హిందీ సినిమాలను బ్యాన్ చేసారు. ఆదిపురుష్ సినిమాలోని ఒకానొక డైలాగ్ కారణంగా పూర్తి సినిమాను బ్యాన్ చేసారు. ఖాట్మాండు మాత్రమే కాదు పోఖారా నగరంలోనూ ఆదిపురుష్ సహా అన్ని హిందీ సినిమాలను నిషేధించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో థియేటర్లలో ప్రదర్శనలు రద్దయ్యాయి. ఆదిపురుష్ సినిమాపై నేపల్ లో వివావం చెలరేగడానికి ముఖ్య కారణం ఆ సినిమాలో, సీత పాత్రను భారతదేశ పుత్రికగా చూపించడమేనని, నిజానికి సీత నేపాల్ లో పుట్టిందని, సినిమాలో తప్పుగా చూపించినందుకు సినిమాను బ్యాన్ చేస్తున్నామని ఖాట్మాండు మేయర్ బెలేంద్ర తెలియజేసారు.
సీత కోసం ప్రత్యేకంగా జనక్ టెంపుల్
నేపాల్ లో 80శాతం హిందువులే ఉంటారు. ఆ దేశంలోని ఒకానొక నగరమైన జనక్ పూర్ లో సీత పుట్టిందని అక్కడివాళ్ళు నమ్ముతారు. జనక మహారాజు పాలించే రాజ్యంలో మిథిలా రాజ్యంలో జనక్ పూర్ ఒక భాగమని అక్కడి వాళ్ళ నమ్మకం. జనక మహారాజు సీతను దత్తత తీసుకున్నారు కాబట్టే జానకి అన్న పేరుతో పిలవబడుతుందని నేపాల్ దేశస్తులు నమ్ముతారు. సీత కోసం ప్రత్యేకంగా జనక్ పూర్ లో జనక్ టెంపుల్ ఉంటుంది. 2018లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, జనక్ పూర్ నుండి అయోధ్య వరకు బస్సు సర్వీసును ప్రారంభించారు. జనక్ పూర్ లోనే రాముడు శివధనుస్సును విరిచాడని, సీతారాముల కళ్యాణం అక్కడే జరిగిందని నమ్ముతారు.