Page Loader
Ajith Kumar: తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అజిత్‌కుమార్‌ 
తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అజిత్‌కుమార్‌

Ajith Kumar: తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అజిత్‌కుమార్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2025
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ నేపథ్యం లేకుండా స్వంత ప్రతిభతో కోలీవుడ్ లో తనకంటూ స్థానం ఏర్పరచుకుని అగ్రనటుడిగా ఎదిగిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు హీరో అజిత్‌. 1990లో తమిళ చిత్రమైన 'ఎన్‌ వీడు ఎన్‌ కణవర్‌' లో విద్యార్థిగా నటనను ఆరంభించిన ఈయన, 1993లో 'అమరావతి' ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఆటో రేసింగ్‌ పై ఆయనకు అపారమైన ఆసక్తి ఉంది. ఆ రంగంలో పాల్గొనే క్రమంలో 15 సర్జరీలు, 5 వెన్నెముక గాయాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. రేసు శిక్షణ సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా ఏడాదిన్నరపాటు మంచానికి పరిమితమైనా, ఆరోగ్యంగా కోలుకుని 1998లో విడుదలైన 'కాదల్‌ మన్నన్‌' చిత్రంతో మరలా వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చారు.

వివరాలు 

మూడు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 

ఇప్పటివరకు 60కు పైగా చిత్రాలలో నటించారు. తమిళనాడు ప్రభుత్వం ఆయనను ఉత్తమ నటుడిగా రెండు సార్లు (2001, 2006) గౌరవించింది. అలాగే, ఉత్తమ తమిళ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులను మూడు సార్లు (1999, 2002, 2006) అందుకున్నారు. తాజాగా దుబాయ్‌లో జరిగిన 24హెచ్‌ కారు రేసింగ్‌ పోటీలలో, అజిత్‌ జట్టు 992 విభాగంలో మూడో స్థానంలో నిలిచింది, ఇది ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. పద్మభూషణ్‌ పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.